నాకే ఫ్రీగా వాటర్ ఇస్తావా: మెక్‌డొనాల్డ్ ఉద్యోగిని లాగికొట్టిన కస్టమర్

ప్రపంచ ప్రఖ్యాత గొలుసు ఆహార సంస్థ మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో విచిత్ర సంఘటన జరిగింది.ఓ వ్యక్తి మెక్‌డొనాల్డ్స్ మహిళా ఉద్యోగిని లాగికొట్టాడు.

 Mcdonalds Employee Punched In Face By Customer For Offering Free Water In Tenne-TeluguStop.com

ఇంతకు ఆమె చేసిన తప్పు ఏంటో తెలుసా.ఉచితంగా మంచినీరు ఇవ్వడమే.

అమెరికాలోని టెనస్సీ రాష్ట్రంలోని ఓ మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌కు 44 ఏళ్ల వ్యక్తి వెళ్లాడు.ఈ క్రమంలో అతను ఓ కప్పు వాటర్ కావాలని మహిళా క్యాషియర్‌ను అడిగాడు.

ఆమె కూడా మంచి నీరు ఇచ్చింది.అయితే సాధారణంగా అందుకు 32 సెంట్లు ఖర్చు అవుతుంది.

అయితే అక్కడ సక్రమమైన వ్యవస్థ లేని కారణంగా ఆమె ఉచితంగానే వాటర్ ఇచ్చింది.దీనిపై మండిపడిన అతను అసభ్యమైన సైగలతో మహిళా క్యాషియర్‌పై విరుచుకుపడ్డాడు.

Telugu Employee, Mcdonalds, Telugu Nri, Tennesee-Telugu NRI

అంతేకాకుండా వాటర్ ఇచ్చినందుకు గాను 100 డాలర్ల బిల్లు ఇవ్వడానికి యత్నించాడు.దీనిని క్యాషియర్ తిరస్కరించడంతో.అతనికి చిర్రెత్తుకొచ్చింది.కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి మహిళా క్యాషియర్ ముఖంపై పదే పదే కొట్టడంతో ఆమె నేలపై పడిపోయింది.

Telugu Employee, Mcdonalds, Telugu Nri, Tennesee-Telugu NRI

క్యాషియర్‌ను కాపాడేందుకు వచ్చిన మరో మహిళా ఉద్యోగిని సైతం దాడికి గురయ్యింది.వీరి అరుపులతో తోటి కస్టమర్లు, ఉద్యోగులు అక్కడికి పరిగెత్తుకు రావడంతో అతను క్యాషియర్ వద్ద ఉన్న కూజాను వారిపైకి విసరడంతో అది గురితప్పింది.దీంతో అక్కడి నుంచి అతను పారిపోయాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని ఎట్టకేలకు పట్టుకున్నారు.నిందితుడి వద్ద నుంచి మాదక ద్రవ్యాలు దొరికినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube