లోగోని మార్చిన మెక్‌డొనాల్డ్స్‌... ఎందుకంటే?

ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్‌ ఫుడ్ రెస్టారెంట్ ఏదని ఎవరన్నా అడిగితే మనకు ఠక్కున గుర్తొచ్చేది మెక్ డోనాల్డ్స్.ఇక ఆ లోగోకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియాలంటే చరిత్ర తెలుసుకోవాలి.1937లో కాలిఫోర్నియాలో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను “ప్యాట్రిక్ మెక్‌డోనాల్డ్” మొదటిసారి ప్రారంభించారు.1940లో ప్యాట్రిక్ మెక్‌డోనాల్డ్ తనయులు అయినటువంటి “రిచర్డ్ మెక్ డోనాల్డ్, మౌరీస్ మెక్ డోనాల్డ్” సాన్ బెర్నార్‌డినోలో మరో రెస్టారెంట్ ప్రారంభించారు.దీనికి “మెక్‌డోనాల్డ్స్‌” అని పేరు పెట్టారు.అలా మెక్‌డోనాల్డ్స్‌ ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు.ఇక దీని లోగో ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లోగోల్లో ఒకటిగా చెబుతారు.మెక్‌డొనాల్డ్స్‌ అనగానే అందరికీ స్ఫురణకు వచ్చేది ఎరుపు మీద వున్న పసుపుపచ్చ రంగు లోగో.

 Mcdonald's Changed Logo Because Mcdonald's, Logo, Changes, Viral Latest, News Vi-TeluguStop.com

కానీ.అరిజోనాలోని సెడోనాలో ఉన్న ఓబ్రాంచ్‌లో మాత్రం మెక్‌డొనాల్డ్స్‌ లోగో దీనికి విరుద్ధంగా నీలిరంగుని కలిగి ఉంటుంది.

ప్రపంచమంతటా మెక్‌డొనాల్డ్స్‌ లోగో బంగారు వర్ణంలో ఉంటే, అక్కడ మాత్రమే నీలి వుంది? ఎందుకంటే? సెడోనా… ఎర్రరాతి పర్వతాలు, సహజ అందాలతో అలరారే అద్భుతమైన నగరం.

అలాంటి నగరం ప్రశాంతతకు అంతరాయం కలిగించే ఏ నిర్మాణాలను, కట్టడాలను అక్కడి స్థానిక అధికారులు అనుమతించరు.

నగరంలో ఏం నిర్మించాలన్నా కొన్ని రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఉన్నాయి.ఆ విధంగా మెక్‌డొనాల్డ్స్‌ అక్కడ రూపుదిద్దుకున్నపుడు స్థానిక అధికారులు దాని పసుపురంగు లోగోపై అభ్యంతరం చెప్పారు.

అంతేకాకుండా దానికి బదులుగా ఆహ్లాదకరంగా ఉండే నీలిరంగును వాడాలని సూచించారు.దీనితో అధికారుల ఆదేశాల మేరకు మెక్‌డొనాల్డ్స్‌ అలాగే ఏర్పాటు చేసింది.ఇప్పుడు అదికూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube