ఇంగ్లాండ్ Vs ఇండియా మహిళా క్రికెట్ మ్యాచ్ లో జరిగిన ఘటనలో దీప్తి శర్మను సమర్ధించిన ఎంసీసీ ...!

భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య మూడో వన్డే జరిగింది.ఈ మ్యాచ్ ను గెలిచిన భారత మహిళలు 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది.

 Mcc Supported Deepti Sharma In The Incident In England Vs India Womens Cricket-TeluguStop.com

ఈ మ్యాచ్ గెలిచే క్రమంలో ఇంగ్లండ్ చివరి వికెట్ ను టీమిండియా మన్కడింగ్ ద్వారా అవుట్ చేసింది.బౌలర్ బంతిని విసరకముందే నాన్ స్ట్రయికర్ ఎండర్ లో ఉన్న బ్యాటర్ క్రీజును వదిలి ముందుకు వెళితే, బౌలర్ ఆ బ్యాటర్ ను రనౌట్ చేయొచ్చు.

అంశంపై మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది.ఇంగ్లండ్ తో మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీప్తి శర్మ వ్యవహరించిన తీరు సమర్థనీయమేనని స్పష్టం చేసింది.

బౌలర్ చేయి నుంచి బంతి రిలీజ్ అయ్యేంతవరకు నాన్ స్ట్రయికర్ క్రీజులో ఉండాలని ఎంసీసీ పేర్కొంది.ఈ నిబంధనను పాటిస్తే మైదానంలో చోటుచేసుకున్న ఘటనల వంటివి జరగవని అభిప్రాయపడింది.

అంతేకాదు, టీమిండియా, ఇంగ్లండ్ మ్యాచ్ లో చోటు చేసుకున్న రనౌట్ పూర్తిగా నిబంధనలకు లోబడి జరిగినదేనని ఎంసీసీ తేల్చిచెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube