ప్రమాదంగా మారుతున్న రహదారులు.. ఎంబీబీఎస్ విద్యార్థి ప్రాణం తీసిన లారీ.. !

Mbbs Student Killed By

దేశంలో రోజు రోజుకు రోడ్దు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందే గాని తగ్గడం లేదు.ఇంట్లో నుండి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇళ్లు చేరతారనే నమ్మకం ఉండటం లేదు.

 Mbbs Student Killed By-TeluguStop.com

నిత్యం ఏదో ఒక రూపంలో మృత్యువు వెంటాడుతు ప్రాణాలను ఫలహారంగా తీసుకు వెళ్లుతుంది.

ఇకపోతే తాజాగా రోడ్దుప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది.

 Mbbs Student Killed By-ప్రమాదంగా మారుతున్న రహదారులు.. ఎంబీబీఎస్ విద్యార్థి ప్రాణం తీసిన లారీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భువనగిరి నుంచి హైదరాబాద్‌కు తన ద్విచక్ర వాహనంపై కాలేజీకి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఆ వివరాలు తెలుసుకుంటే.యాదాద్రి భువనగిరి పట్టణానికి చెందిన వాసం భాను ప్రసాద్(21) అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడట.

ఈ క్రమంలో ఈరోజు కాలేజీకి వెళ్లుతున్న సమయంలో భువనగిరి శివారులోని, సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో, కిందపడిన ప్రసాద్ తలపై నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడట.

ఇక మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

#MBBS #Bhuvanagiri #Yadadri #Lorry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube