లాక్ డౌన్ లో సీక్రెట్ గా హీరోయిన్ పెళ్లి...!

నేడు ప్రముఖ కన్నడ హీరోయిన్ మయూరి క్యాటరీ సీక్రెట్ గా వివాహం జరిగింది.ఇక ఈ బ్యూటీ తన స్నేహితుడైన అరుణ్ ని పెళ్లి చేసుకుంది.

 Heroine Secret Wedding In This Lockdown!,lockdown,mayuri Kyatari, Kannada Heroin-TeluguStop.com

వీళ్ళ వివాహం శ్రీ తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా సింపుల్ గా జరిగింది.అంతేకాకుండా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ.

కొద్దిమంది బంధువుల సమక్షంలో పెళ్లి జరిగింది అని ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు.

ఇక ఈ బ్యూటీ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది… పదేళ్ల స్నేహానికి… నేడు అర్థవంతమైన ముగింపు లభించింది అంటూ మయూరి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.

ఇది ఇలా ఉండగా… మరోవైపు మయూరి తన పెళ్లి ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేంతవరకు కూడా సినిమావాళ్ళకి కానీ, అటు అభిమానులకు ఎవరికి కూడా తెలియదు.

అలాగే ఫొటోస్ తో పాటు ఈ బ్యూటీ అరుణ్ మూడు ముళ్లు వేసిన వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది.

ప్రస్తుతం వీరి ఇద్దరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇక హీరోయిన్ మయూరి అభిమానులు… కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే కన్నడ సినీ తారలు కూడా కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా చేసుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube