విడ్డూరం : ఇలా మన దేశంలో చేస్తే రాజకీయ నాయకులంతా చావడం ఖాయం

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చే హామీలు ఎన్నో ఉంటాయి.అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల్లో కనీసం కొన్నింటినైనా నెరవేర్చలేక పోతున్నారు.

 Mayor Of Mexico Dragged Through Streets By People Because He Dont Stand For Hos-TeluguStop.com

ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు గాలి మూటలే అవుతున్నాయి.కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది.

ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చి హడావుడి చేస్తారు.ఆ తర్వాత కనిపించకుండా పోతారు.

ఓట్లు వేసి గెలిపించిన వారు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాంటూ నాయకుల వెంట పడి తిరిగి అడుక్కోవాలి.

Telugu Dontstand, Chipas, George, Mayor, Mayormexico-

  ఇండియాలో ఎక్కువ ఇదే పరిస్థితి కొనసాగుతుంది.కాని మెక్సికోలో మాత్రం అక్కడి వారు నాయకుడి వెంట పడి అడుక్కోలేదు.తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్‌ చేశారు.

హామీలను నెరవేర్చకుంటే చంపేందుకు కూడా సిద్దం అంటూ హెచ్చరించారు.కాని ఆ నాయకుడు హెచ్చరికను కూడా బేకాతరు చేయడంతో చివరకు ఆయన్ను కిడ్నాప్‌ చేసి మరీ తగిన బుద్ది చెప్పేందుకు అక్కడి ఓటర్లు సిద్దం అయ్యారు.

ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్న ఈ విషయం రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

Telugu Dontstand, Chipas, George, Mayor, Mayormexico-

  పూర్తి వివరాల్లోకి వెళ్తే.దక్షిణ మెక్సికోలో చిపాస్‌ అనే రాష్ట్రం ఉంది.ఆ రాష్ట్రంలోని లాస్‌ మార్గరీటాస్‌ అనే పట్టణం ఉంది.

ఆ పట్టణంకు జార్జ్‌ లూయీస్‌ ఎస్కాండన్‌ ఫెర్నాండెజ్‌ మేయర్‌గా గెలుపొందాడు.ఆయన ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చాడు.

ముఖ్యంగా తోజోలాబల్‌ తెగకు కొన్ని ప్రత్యేకమైన హామీలు ఇచ్చాడు.మేయర్‌ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతాడని చాలా కాంగా ఎదురు చూస్తున్న వారికి ఓపిక నశించింది.

ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోకుండా వదిలేశాడు.

తమకు ఇచ్చిన హామీలను ఇకపై అయన పట్టించుకోడనే ఉద్దేశ్యంతో ఆ తెగకు చెందిన దాదాపు 30 మంది ఏకం అయ్యి మేయర్‌ను కిడ్నాప్‌ చేశారు.

కిడ్నాప్‌ సమయంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఆ సమయంలో మేయర్‌ పక్కన ఉండే వారిని గాయపర్చడం కూడా జరిగింది.ఆ తర్వాత మేయర్‌ను ఒక ట్రక్‌కు కట్టి లాక్కెల్లారు.దాదాపు 200 మీటర్ల దూరం మేయర్‌ను లాక్కెల్లగా అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు విషయాన్ని గుర్తించి వెంటనే అడ్డుకున్నారు.

Telugu Dontstand, Chipas, George, Mayor, Mayormexico-

  పోలీసులు తక్షణమే స్పందించడంతో మేయర్‌ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.అంతా బాగానే ఉన్నదని పోలీసులు తెలియజేశారు.ఆ 30 మందిని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.మేయర్‌ మాత్రం ఆ జాతి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చాలా రోజులుగా అందుకోసమే చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నాడు.

పై స్థాయి నుండి నిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను.ఆ విషయాన్ని వారు తెలుసుకోకుండా ఇలా చేశారని వాపోతున్నాడు.కాని మేయర్‌ మాటలను ఆ తెగ ఖండిస్తుంది.ఆయన ఎన్నో హామీలను విస్మరించాడని విమర్శిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube