ఈ అమెరికా మేయర్ దెబ్బకి ట్రంప్ పరువు పాయే..!!!  

Mayor Muriel Bowser Over George Floyd Death - Telugu Black S Matter, Mayor Muriel Bowser,, Street Name, Washington

అమెరికాలో పోలీసుల చేతిలో నల్ల జాతీయుడు అయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే.తమ జాతీయుడిపై పోలీసుల అమానుష చర్యపై తిరగబడిన నల్లజాతీయులు అమెరికాలో పలు ప్రాంతాలలో సృష్టించిన అల్లర్లు.

 Mayor Muriel Bowser Over George Floyd Death

దాడులకి ట్రంప్ ప్రభుత్వం ఉలిక్కి పడింది.ఈ క్రమంలోనే ట్రంప్ వెన్నులో వణుకు పుట్టి బంకర్ లో తలదాచుకున్నాడని అమెరికా మీడియా వార్తలని రాసుకొచ్చింది.

ఆందోళన కారులు వైట్ హౌస్ దరిదాపులకి దూసుకువెళ్ళడంతో ఒక్కసారిగా పోలీసులు వారిపై బాష్ప వాయువుని ప్రయోగించారు…

ఈ అమెరికా మేయర్ దెబ్బకి ట్రంప్ పరువు పాయే..-Telugu NRI-Telugu Tollywood Photo Image

పెప్పర్ బులెట్ల తో విరుచుకు పడ్డారు.ట్రంప్ ఏకంగా ఒకడుగు ముందకు వేసి ఆర్మీ ని రంగంలోకి దించుతానని చెప్పడంతో సొంత పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి.

ఈ ఘటనపై స్పందించిన వాషింగ్టన్ మేయర్ మురియాల్ బోవ్సేర్ ట్రంప్ తీరుపై మండిపడ్డారు.సైనిక చర్యలతో నల్ల జాతీయులపై ఉక్కు పాదం మోపాలని అనుకోవడం మంచి పరిణామం కాదని తెలిపారు.

వైట్ హౌస్ కి దగ్గరలోనే ఆమె మేయర్ గా ఉన్న ప్రాంతలో ట్రంప్ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఆమె ఓ వినూత్నమైన ప్రయత్నానికి సిద్దపడ్డారు.

వైట్ హౌస్ కి వెళ్ళే దారిపై “బ్లాక్ లైవ్స్ మ్యాటర్” అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో పెయింటింగ్ వేయించారు.

అందుకు గాను ఆమె పెద్ద ఎత్తున వాలంటీర్ల ని నియమించారు.అక్కడితో ఆగకుండా వైట్ హౌస్ ముందు ఉన్న ఒక వీధికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్లాజా అని పేరు పెట్టారు.

నిరసన కారులని శాంతియుతంగా నిరసనలు తెలుపమని పిలుపునిచ్చారు.వారు కూడా తమ నిరసనలని శాంతియుతంగానే చేపట్టారు.ఇదిలాఉంటే ఒక పక్క ట్రంప్ నిరసన కారులపై నిప్పులు చేరుగుతుంటే ఈ మహిళా మేయర్ వారికి మద్దతు తెలుపుతూ పెయింటింగ్ వేయించడంతో ట్రంప్ పరువు పోయినట్టేనని అంటోంది స్థానిక మీడియా.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mayor Muriel Bowser Over George Floyd Death Related Telugu News,Photos/Pics,Images..

footer-test