రాజస్థాన్ సంక్షోభం: కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన మాయావతి!

రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దెబ్బతో అసలుకే తలకు బొప్పికట్టి ఉన్న కాంగ్రెస్ కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మరో గట్టి ఝలక్ ఇచ్చింది.ఇటీవల రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం లో రోజుకొక కీలక మలుపు చోటుచేసుకుంది.

 Bsp Issues Whip To 6 Rajasthan Mlas, Rajasthan Assembly, Mayawati, Sachin Pilot,-TeluguStop.com

సొంత పార్టీ పైనే సచిన్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడం తో అల్లాడిపోతున్న కాంగ్రెస్ కు మాయావతి తనదైన తీరులో గట్టి ఝలక్ ఇవ్వాలని చూస్తుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి బీఎస్పీ కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే గెహ్లాట్ కు మద్దతు ఇస్తున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరిపోవడం తో మాయావతి తనదైన శైలి లో చెక్ పెట్టడానికి తాజాగా విప్ జారీ చేసింది.తన పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గెహ్లాట్ కు మద్దతుగా ఓటు వేయరాదంటూ స్పష్టం చేసింది.

బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.అయితే ఎన్నికల్లో వారంతా కూడా బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేసి గెలవడం తో పార్టీ అధినేత్రి విప్ జారీ చేసింది.

దీనితో ఇప్పుడు గెహ్లాట్ సర్కార్ కు మరో సమస్య వచ్చిపడినట్లు అయ్యింది.
ఆరుగురు ఎమ్మెల్యేలకు వేర్వేరుగా, సమిష్టిగా నోటీసులు జారీ చేశాం.

బీఎస్పీ ఒక జాతీయ పార్టీ కాబట్టి, జాతీయస్థాయిలో విలీనం అయితే తప్ప తమ సభ్యులు రాష్ట్ర స్థాయిలో విలీనం కుదురదని, వారు దీనిని ఉల్లంఘిస్తే అనర్హులు అవుతారు అంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube