మాయాబజార్ రీ రిలీజ్.. పోటీ గట్టిగానే ఉంది!  

Mayabazar Rerelease On This Friday-mayabazar Rerelease,ntr,tollywood Gossips

టాలీవుడ్ లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న చిత్రం మాయాబజార్. ఎలాంటి సిజి వర్క్ లేని సమయంలో కెమెరా యాంగిల్స్ తోనే అద్భుతమైన గ్రాఫిక్స్ ని చూపించిన దర్శకుడు కెవి.రెడ్డి..

మాయాబజార్ రీ రిలీజ్.. పోటీ గట్టిగానే ఉంది! -Mayabazar Rerelease On This Friday

1957లో వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా షేర్స్ ను అందించి ప్రపంచాన్ని ఆకర్షించింది.

అయితే ఆ సినిమాను 2010లో గోల్డ్ స్టోన్ అనే సంస్థ ప్రస్తుత సినిమాల మాదిరిగా రంగుల్లోకి మార్చి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక సినిమాను ఇప్పుడు మరోసారి రిలీజ్ చేసేందుకు ఒక డిస్ట్రిబ్యూటర్ సిద్దమయ్యాడు. ఈ నెల 12న దినేష్ పిక్చర్స్ సంస్థ మాయాబజార్ కలర్ సినిమా హక్కులను అందుకొని రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.

అయితే 12వ తేదీన తెలుగులో మరో నాలుగు సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. అందులో దొరసాని – నిను వీడని నీడను నేనే సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ పోటీలో మయా బజార్ ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.