మే నెల బాక్సాఫీస్ రివ్యూ ఇదే.. ఆ మూడు సినిమాలు మాత్రమే హిట్టయ్యాయంటూ?

May Month Boxoffice Review Details Here Goes Viral In Social Media Details, Telugu Movies Latest News,telugu Movies In May Month Update,May Month Movies Release Update,May Month Moives Release Updates,Ramabanam,Ugram Movie,Custody Movie,the Kerala Story,2018 Movie,Bichagadu 2 Movie

ప్రతి సంవత్సరం సమ్మర్ లో విడుదలైన సినిమాలు ( Cinemas )బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.అల్లు అర్జున్ కొన్నేళ్ల క్రితం వరకు తన సినిమాలను సమ్మర్ లోనే ఎక్కువగా విడుదల చేయడానికి ఆసక్తి చూపించారు.

 May Month Boxoffice Review Details Here Goes Viral In Social Media Details, Telu-TeluguStop.com

ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే.అయితే ఈ ఏడాది మే నెలలో రిలీజైన సినిమాలు మాత్రం ప్రేక్షకులు ఊహించని రేంజ్ లో షాకిచ్చాయి.

మే నెల తొలి వారంలో రామబాణం, ఉగ్రం( Ramabanam, Ugram movie ) సినిమాలు రిలీజయ్యాయి.ఈ రెండు సినిమాలలో ఉగ్రం యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా రామబాణం సినిమా డిజాస్టర్ గా నిలిచింది.మే నెల రెండో వారంలో విడుదలైన సినిమాలలో కస్టడీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాతో పాటు టీ బ్రేక్, మ్యూజిక్ స్కూల్, ఫర్హానా, కళ్యాణమస్తు, భువన విజయమ్, ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ రిలీజ్ కాగా ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేదు.

అయితే ఇదే వారంలో వచ్చిన ది కేరళ స్టోరీ( The Kerala Story ) మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.మే నెల మూడో వారంలో అన్నీ మంచి శకునములే రిలీజ్ కాగా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.ఈ సినిమా రిలీజైన మరుసటి రోజు విడుదలైన బిచ్చగాడు2( Bichagadu 2 movie ) మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.మే మూడో వారంలోనే విడుదలైన హసీనా మూవీ కూడా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.

మే నెల నాలుగో వారంలో మళ్లీ పెళ్లి, మేము ఫేమస్, మెన్ టూ, జైత్ర, 2018 రిలీజ్ కాగా ఈ సినిమాలలో 2018 మాత్రమే సక్సెస్ సాధించింది.మే నెలలో విడుదలైన సినిమాలలో బిచ్చగాడు2, ది కేరళ స్టోరీ, 2018 సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

Video : May Month Boxoffice Review Details Here Goes Viral In Social Media #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube