కేఎల్ రాహుల్ ని తనని క్షమించమని కోరానంటున్న మ్యాక్స్‌వెల్..!  

తాజాగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్ లో తన అభిమానులను నిరాశపరిచిన వ్యక్తి ఎవరు అంటే.ఆస్ట్రేలియా దేశానికి చెందిన స్టార్ బ్యాట్స్మెన్ మ్యాక్స్ వెల్.

TeluguStop.com - Maxwell Asks Kl Rahul To Forgive Him

ఇది ఇలా ఉండగా తాజాగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఏకంగా మూడు సిక్సర్లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు.అది కూడా కేవలం 19 బాల్స్ ఆడిన మ్యాక్స్ వెల్ ఏకంగా 3 సిక్సర్ల సహాయంతో 45 పరుగులు చేసి ఆస్ట్రేలియా గెలుపులో పాలుపంచుకున్నాడు.

అయితే ఇందుకు సంబంధించి తాజాగా మ్యాక్స్ వెల్ పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అభిమానులు తెగ సెటైర్లు వేస్తున్నారు.

TeluguStop.com - కేఎల్ రాహుల్ ని తనని క్షమించమని కోరానంటున్న మ్యాక్స్‌వెల్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇకపోతే కేవలం కింగ్స్ లెవెన్ పంజాబ్ నుంచి మ్యాక్స్ వెల్ మాత్రమే కాకుండా న్యూజిలాండ్ దేశానికి చెందిన జిమ్మీ పై కూడా సెటైర్లు పేలుతున్నాయి.

తాజాగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ న్యూజిలాండ్ తో వెస్టిండీస్ జట్టు తలపడగా అందులో కేవలం 24 బంతుల్లో 48 పరుగులు చేసి తన సత్తా చూపించాడు.అయితే వీరిద్దరిపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ ఎంతో నమ్మకం ఉంచిన వారు వాటిని తలకిందులు చేస్తూ దారుణంగా విఫలమయ్యారు.ముఖ్యంగా మాక్స్ వెల్ 13 మ్యాచులు ఆడిన కేవలం 108 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు.ఇందులో భాగంగానే కొందరు పంజాబ్ కింగ్ ఎలెవన్ జట్టు ఫ్యాన్స్ మాక్స్ వెల్, జిమ్మీ లను ట్రోల్ చేస్తున్న వాటిపై జిమ్మీ స్పందించాడు.

ఇందులో భాగంగా జిమ్మీ, మాక్స్ వెల్ తమ జాతీయ జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడుతుంటే రాహుల్ ఎలా చూస్తున్నాడు అంటూ ఓ ఫోటోను మార్ఫింగ్ చేసి రాహుల్ ఫోటోను అక్కడ ఉంచారు.అయితే ఈ ఫోటోను చూసిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ.అవును, అది నిజమే అంటూ మాక్స్ వెల్ ను ట్యాగ్ చేశాడు.దీంతో మ్యాక్స్ వెల్ జిమ్మీ ట్వీట్ కు స్పందించిగా అందులో తాను గత మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ కు సారీ చెప్పానని నవ్వుతూ కామెంట్ పెట్టాడు.

అంతేకాదు, తన ట్వీట్ చేసిన సమయంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రెండ్స్ అంటూ హాష్ బ్యాగ్ జతచేశారు.

#Sorry #Requested #Social Media #KL Rahul #Maxwell

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Maxwell Asks Kl Rahul To Forgive Him Related Telugu News,Photos/Pics,Images..