ఆ వ్యక్తికి 600 ఏళ్ల జైలు శిక్ష.. ఏం నేరం చేశాడంటే?

సాధారణంగా కోర్టు ఎంత పెద్ద తప్పు చేసినా మన దేశంలో 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది.కొన్ని దేశాల్లో ఐతే 14 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షే విధిస్తారు.

 Us Man Matthew Sentenced To 600 Years In Prison In Child Abusing Case, Tuscaloos-TeluguStop.com

అయితే మాథ్యూ టేలర్‌ మిల్లర్‌ అనే వ్యక్తికి మాత్రం కోర్టు ఏకంగా 600 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.అమెరికాలోని కాటన్‌డేల్‌లో లోని ఒక వ్యక్తి అభం శుభం తెలియని చిన్నారులను లైంగిక చర్యలకు ప్రోత్సహించడంతో పాటు ఆ దృశ్యాలను చిత్రీకరించాడు.

లెక్కకు మించిన లైంగిక నేరాలకు పాల్పడ్డాడు.
దీంతో ఈ కేసులో అమెరికా డిస్ట్రిక్ట్‌ జడ్జి స్కాట్‌ కూగ్లర్‌ మాథ్యూకు ఏకంగా 600 సంవత్సరాల శిక్ష విధించారు.

అయితే అతని చేతిలో బలైపోయిన వారు మాత్రం ఈ శిక్ష చాలా తక్కువని.ఇంతకు మించిన శిక్ష అమలు చేయాలని అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం.మాథ్యూ పదుల సంఖ్యలో చిన్నారుల జీవితాన్ని చిదిమేశాడు.ఇతనిపై అనేక అభియోగాలు ఉండటంతో విచారణ జరిపి సాక్ష్యాధారాలను పరిశీలించి కోర్టు శిక్ష విధించింది.

మాథ్యూ నాలుగు సంవత్సరాల చిన్నారిని కూడా వదల్లేదంటే అతనెంత క్రూరుడో సులభంగానే అర్థమవుతుంది. ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి జానీ షార్ప్‌ గడిచిన ఐదేళ్లలో ఎన్నో దారుణాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

అతని గదిలో చిన్నారులకు సంబంధించిన మృతదేహాలు కనిపించాయని చెప్పారు.మాథ్యూ పన్నెండు సంవత్సరాల బాలికపై అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు.

గతేడాది అక్టోబర్ లో మాథ్యూ నేరం అంగీకరించాడు.

అధికారులు 600 సంవత్సరాల శిక్ష విధించడం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మాథ్యూ చేసిన నేరాలు సమాజానికి హానికరమని అధికారులు పేర్కొన్నారు.ఎఫ్‌బీఐ బాలల దోపిడీ, హ్యూమన్ ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిపింది.

అయితే నిందితునికి కోర్టు కఠిన శిక్ష విధించడం పట్ల చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube