మాటంటే మాటే.. తగ్గేదేలే.. అంటున్న నరేంద్ర మోడీ..!

ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారిని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము.అలాంటి కోవలోకి చెందిన వారిలో మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ కూడా ఒకరు అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అనే చెప్పాలి.

 Matte Matte Taggedele Narendra Modi Says  Pm Modi, Narendra Modi, Meets, Pv Sin-TeluguStop.com

దేశ ప్రధాని అయినాగానీ తాను ఇచ్చిన మాటని సిరసావహిస్తారు మన పీఎం.టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికీ చెందిన క్రీడాకారులు ఆటల్లో వాళ్ళ ప్రతిభని కనబరిచి, మన దేశానికీ గొప్ప పేరు ప్రతిష్టలను తీసికుని వచ్చారు.

అయితే టోక్యో ఒలంపిక్స్ కి వెళ్ళకముందే మన మోదీ వాళ్ళని కలిసి వాళ్ళ ఇష్ట ఇష్టాలను తెలుసుకుని, వాళ్లలో స్ఫూర్తిని నింపే మాటలు చెప్పారు.

ఈ క్రమంలోనే పీవీ సింధుకు ఏమి ఇష్టం అని అడగగా నాకు ఐస్ క్రీం ఇష్టమని చెప్పింది.

నువ్వు ఒలంపిక్స్ లో పతకం సాధించుకునిరా మనం ఇద్దరం కలిసి ఐస్ క్రీం తిందామని మాట ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్‌ లో పతకాలు సాధించిన మన ఇండియన్ అథ్లెట్స్ కు తన నివాసంలో విందు ఏర్పాటు చేసి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు మోడీ.

ఆయన మాట ఇచ్చినట్టుగానే భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధుకు మోడీ ఐస్‌క్రీం తినిపించారు.

Telugu Cream, Meets, Narendra Modi, Pm Modi, Pv Sindhu, Tokyo Olym-Latest News -

అలాగే భారత దేశానికీ మొట్టమొదటి సారి అథ్లెటిక్స్‌ లో బంగారు పతకం తెచ్చిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు చుర్మా ను కూడా రుచి చూపించారు.వారితో పాటు రెజ్లర్లు దీపక్ పునియా, రవి దహియా, బాక్సర్ లవ్లీనా, హాకీ క్రీడాకారులను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా వారి విజయ రహాస్యాలను అడిగి తెలుసుకుని భవిష్యత్తులో ఇంకా విజయాలు సాధించాలని అన్నారు.

మోడీ ఇంటికి ఆతిధ్యానికి వచ్చిన క్రీడాకారులతో ఎంతో ఆప్యాయతతో మాట్లాడారు.మోడీ ఆతిధ్యాన్ని స్వీకరించిన క్రీడాకారులు సైతం మోడీకి కృతజ్ఞతలు తెలిపి ధన్యవాదాలు తెలిపారు.విందు అనంతరం ఒలింపిక్ విజేలతో ప్రధాని ఫోటోలు దిగారు.ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube