'జనసేన' కి...మొదటి నిరసన..రాజీనామా..!!!  

ఏపీ రాజకీయాలు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల్లోగా ప్రజల్లోకి తమ పార్టీ దూసుకుపోవాలని ఎవరికి వారు వ్యుహాలని సిద్దం చేసుకుంటున్నారు. చోటామోటా నేతలు తమ తమ పార్టీలలోకి వస్తుంటే ఎదురేగి మరీ సాదర స్వాగతం చెప్తున్నారు. అయితే ఎవరు నిబద్దతో పని చేస్తారో అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయం. అందుకే నేతలు చేరేముందు వారి సామర్ధ్యం ఎంత..?? రాజకీయ నాటకంలో భాగంగా వస్తున్నాడా..?? లేదా అనే విషయాలని కూలంకషంగా చర్చించుకోవాలి. ఆ తరువాత పార్టీలోకి ఆహ్వానించాలి. అయితే

Mathe Babi What To Quit From Pawan Kalyan Janasena Party-Mathe Mathe Party

Mathe Babi What To Quit From Pawan Kalyan Janasena Party

టీడీపీ ,వైసీపీ లికి ఇలాంటి విషయాలలో పెద్దగ పట్టింపులు ఉండవు వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు.ఇవన్నా సహజంగా జరిగిపోతాయి. కాని ఈ చేరికలు , పదవులు రాలేదని అసంతృప్తితో వెళ్లి పోయే నేతలు అన్ని పార్టీలలో ఉండే గొడవలే కాని. జనసేన లాంటి పార్టీలో ఇలాంటి తగవులని అందరూ పాయింట్ చేసి చూపిస్తారు. అంతేకాదు మీడియా సైతం ఈ విషయంలో కాస్త దూకుడుగానే ఉంటుంది. అయితే జనసేన పార్టీ అసంత్రుపుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. తాజాగా జరిగిన ఓ సంఘటన పవన్ కి హెచ్చరికలా ఉపయోగపడుతుంది..అదేంటంటే..

పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన పార్లమెంట్ ప్రధాన కమిటీలలో సామాజిక న్యాయం జరగలేదని , ఆరు ప్రధాన పదవులను ఒకే ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని నిరసన వ్యక్తం చేశారు మత్తే బాబి. అంతేకాదు జనసేన ఏలూరు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్‌ మెంబరు కి పార్టీ మెంబర్‌షిప్‌కు రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పవన్ పై విమర్శలు గుప్పించారు.

Mathe Babi What To Quit From Pawan Kalyan Janasena Party-Mathe Mathe Party

జనసేనలో సామాజిక న్యాయం లేదని. కాని ఒక పక్క పవన్ కళ్యాణ్ మాత్రం తనకి కుల ,మాత ,భేదం లేదని చెప్తూనే కమిటీలలో సమన్యాయం చేయకుండా ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ పదవులను కట్టబెట్టారని, దీంతో తాను మనస్తాపానికి గురయినట్టు పేర్కొన్నారు…అంబేద్కర్ ఆశయాలు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం తప్ప చేతల్లో లేదని బాబి ఫైర్ అయ్యారు. తానూ పార్టీకోసం ఎంతో కష్టపడ్డానని తీరా ఇలాచేస్తారని అనుకోలేదని బాబి ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత ఇలాంటి విషయాలలో గనుకా చొరవతీసుకోక పొతే పరిస్థితి చేయి దాటిపోతుందని, సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రజారాజ్యంలో కూడా లుకలుకలు మొదలయ్యాయని, ఆ తదుపరి పరిణామాలు ఎలాంటి పరిస్థితులకి దారి తీశాయో పవన్ గుర్తు చేసుకోవాలని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు.