సమాజ సేవపై ఫోకస్... ముంబై ఎన్జీవోతో పనిచేయనున్న మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా జస్టిన్ నారాయణ్

నువ్వా నేనా అంటూ పోటాపోటీగా సాగిన మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా-13 పోటీల్లో.భారత సంతతికి చెందిన జస్టిన్ నారాయణ్ (27) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

 Masterchef Australia Winner Justin Narayan Plans To Work With Mumbai Ngo, Kishwa-TeluguStop.com

ఇద్దరు ఫైనలిస్టులు కిశ్వర్ చౌధురీ, పెటె కాంప్‌బెల్‌ను వెనక్కినెట్టి నారాయణ్ ట్రోఫీని అందుకున్నారు.ఈ 13వ సీజన్‌ ఏప్రిల్ 19న ప్రారంభమై.

జులై 13న ముగిసింది.ముగ్గురు న్యాయనిర్ణేతల్ని మెప్పించి జస్టిన్ నారాయణ్ విజేతగా నిలిచారు.ఇందుకు గాను ఆయనకు 2.50,000 డాలర్ల ( భారత కరెన్సీలో రూ.1.86 కోట్లు) ప్రైజ్‌ మనీతో పాటు ఒక ట్రోఫీని బహూకరించారు.తాజా సీజన్‌ భారతీయుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.పోటీలు ముగిసిన తర్వాత జస్టిన్ నారాయణ్ గురించి నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేశారు.ఆయన ఎవరు.? భారత్ నుంచి ఎలా వలస వెళ్లారు లాంటి విషయాలను జల్లెడ పట్టారు.

Telugu Gagan Anand, Gordon Ramsey, Justin Yan, Mahim Railway, Ngo Rescue, Pete C

కాగా, జస్టిన్ నారాయణ్ తాజాగా సమాజసేవపై దృష్టి పెట్టారు.దీనిలో భాగంగా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎన్జీవో సంస్థ విజన్ రెస్క్యూ కోసం పనిచేయాలని భావిస్తున్నారు.2004లో పాస్టర్, మోటివేషనల్ స్పీకర్ బిజు థాంపీ ఈ విజన్ రెస్క్యూని ప్రారంభించారు.మహీం రైల్వే స్టేషన్‌లో నివసిస్తున్న అనాథ పిల్లలకు వాడా పావ్‌ను అందించాలని మొదలుపెట్టిన ఈ సంస్థ.

నానాటికీ తన సేవలను విస్తరిస్తోంది.మాదక ద్రవ్యాలు, పిల్లలకు ఆరోగ్య సంరక్షణ అందించడం, మురికివాడల్లో పాఠశాలల ఏర్పాటు, మానవ అక్రమ రవాణా ముఠాల నుంచి రక్షించబడిన మహిళలకు వసతిని అందించడం, పాఠశాలలకు వెళ్లని పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడం వంటి పనులను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

Telugu Gagan Anand, Gordon Ramsey, Justin Yan, Mahim Railway, Ngo Rescue, Pete C

జస్టిన్ నారాయణ్ పశ్చిమ ఆస్ట్రేలియాలో పెరిగారు.ఫేమస్ చెఫ్‌లు గగన్ ఆనంద్, గోర్డన్ రామ్‌సేలు స్పూర్తిగా 13 ఏళ్ల చిరుప్రాయంలో నారాయణ్ వంటలు చేయడం ప్రారంభించారు.2017లో భారతదేశానికి వచ్చిన జస్టిన్ నారాయణ్.భారతీయ వంటలకు, రుచికి ఫిదా అయ్యారు.ఆ రోజు నుంచి భారతీయ వంటకాలను తయారు చేయడం ప్రారంభించారు.యూత్ పాస్టర్‌గా పనిచేస్తున్న జస్టిన్.మాస్టర్ చెఫ్ కిచెన్‌లో అవకాశం రావడంతో తన మాస్టర్ డిగ్రీని మధ్యలోనే ఆపివేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube