హీరో కాకుండానే బ్రాండ్ అంబాసిడర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగులో చాలా సినిమాలలో నటించి మెప్పించిన నటుడు మాస్టర్ తేజ.ఓ బేబీ సినిమాతో మళ్ళీ టీనేజ్ కుర్రాడిగా రీఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఇరగదీసాడు.ఇక హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నాడు.త్వరలో అతను హీరోగా సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ కానుంది.అయితే హీరోగా ఇంకా ఎంట్రీ కాకుండా ఈ కుర్రాడు ఓ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ ని బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు.ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన కాంటినెంటల్ కాఫీతో అసోసియేట్ అయ్యాడు.

 Master Teja Brand Ambassador For Continental Coffee, Tollywood, South Cinema, Te-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి తేజ సిద్ధమైపోయాడు.

టాలీవుడ్ లో ఎక్కువగా కంపెనీలో భాగా గుర్తింపు ఉన్న హీరోలని బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటాయి.

కాని తేజ ఎలాంటి క్రేజ్ లేకుండానే ఈ అవకాశం పట్టేయడం విశేషం.ఈ బ్రాండ్‌కు సంబంధించి ఓ ఫొటో షూట్ కూడా చేశాడు తేజ.రెండు పోస్టర్స్, ఓ ప్రమోషనల్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ కాంటినెంటల్ కాఫీతో అసోసియేట్ అవ్వడం హ్యపీగా ఉందని తెలిపాడు.లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ కాంటినెంటల్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అని అంటున్నాడు.

సోలో హీరోగా ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే తేజకు ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్‌తో అసోసియేట్ అవ్వడం గొప్ప విషయమే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube