మెగాస్టార్ టైటిల్ ని వాడేసిన తమిళ స్టార్ హీరో  

Master Official First Look-megastar Chiranjeevi,thalapathy Vijay,vijay Sethupathi

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఇలయదలపతి విజయ్ ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తూ, కమర్షియల్ హిట్స్ తో వరుసగా వంద కోట్లకి పైగా కలెక్షన్ చేస్తున్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.

Master Official First Look-Megastar Chiranjeevi Thalapathy Vijay Sethupathi

దీంతో ఇప్పుడు అతని ఇమేజ్ కోలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉంది.తెలుగులో మహేష్ బాబు రేంజ్ లో అతని సినిమాల బడ్జెట్, మార్కెట్ కూడా నడుస్తుంది.

ఇక తెలుగులో కూడా అతని సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరోలు మెగాస్టార్ సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ పై దృష్టి పెట్టారు.

ఇప్పటికే కార్తీ వరుసగా ఖైదీ, దొంగ టైటిల్స్ ని వాడుకొని రెండు హిట్స్ కొట్టాడు.ఈ రెండు టైటిల్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలు కావడం విశేషం.

ఇప్పుడు విజయ్ కూడా తన కొత్త సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ టైటిల్ ని వాడేసాడు.కార్తీకి ఖైదీతో సూపర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మాస్టర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి తాజాగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

ఇక తెలుగు, తమిళం రెండింటిలో ఇదే టైటిల్ తో ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేసేసారు.మరి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించిన దర్శకుడు లోకేష్ ఈ సినిమాతో విజయ్ కి తెలుగులో మరో సూపర్ హిట్ ఇస్తాడేమో వేచి చూడాలి.

తాజా వార్తలు