‘మాస్టర్’ ప్లాన్ బాగానే ఉందిగా!  

Master Movie To Have Theatre Release, Master, Vijay, Lokesh Kanagaraj, Vijay Sethupathi, OTT, Kollywood News - Telugu Kollywood News, Lokesh Kanagaraj, Master, Ott, Vijay, Vijay Sethupathi

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ ఇప్పటికే ఎలాంటి క్రేజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో విజయ్ మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - Master Movie To Have Theatre Release

అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడటంతో మాస్టర్ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టింది.దీంతో థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంపై చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు.ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోమని లోకేష్ చెప్పుకొచ్చాడు.

TeluguStop.com - ‘మాస్టర్’ ప్లాన్ బాగానే ఉందిగా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు.త్వరలోనే కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు చక్కబడితే థియేటర్లు ఓపెన్ చేస్తారని, అప్పుడే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి.దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఇళయథలపతి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లోకేష్ కనగరాజ్ తీర్చిదిద్దుతుండటంతో, ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

#Vijay #Master

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Master Movie To Have Theatre Release Related Telugu News,Photos/Pics,Images..