తెలుగులో ఈసారి కూడా విజయ్‌ కి నిరాశ తప్పదేమో

తమిళంకు చెందిన పలువురు స్టార్‌ హీరోలు తెలుగులో వరుసగా సినిమాలతో సక్సెస్ లు కొడుతున్నారు.కాని తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మాత్రం ఇప్పటి వరకు తెలుగులో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న దాఖలాలు లేవు.

 Master Movie Telugu States Collections, Vijay Thalapathi, Master Movie, Tollywoo-TeluguStop.com

తమిళం లో వందల కోట్లు సాధించే విజయ్‌ తెలుగు నాట మాత్రం ఇప్పటి వరకు పది కోట్లు సాధించినది లేదు.ఈయన సినిమాలు ఇప్పుడిప్పుడు కాస్త జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఈ సంక్రాంతికి ఈయన మాస్టర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన మాస్టర్‌ సినిమా తమిళ నాట 150 కోట్లు వసూళ్లు చేయడం ఖాయం అన్నట్లుగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8.5 కోట్ల బిజినెస్ చేయడంతో 9 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది.ఇప్పుడు ఆ మొత్తం అయినా సాధ్యమా అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Telugu Alludu Adurs, Kollywood, Krack, Master, Ram, Red, Tamil, Vijay-Movie

అరవ హీరో సినిమాను ఈ కరోనా పరిస్థితుల్లో అది కూడా ఎక్కువ టికెట్‌ రేటుకు చూడాలా అంటూ చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఆలోచించే అవకాశం ఉంది.కనుక మాస్టర్‌ సినిమాకు మరో సారి తెలుగు రాష్ట్రాల్లో నిరాశ తప్పక పోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వారు అంటున్న దాని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.5 నుండి 6 కోట్లు వసూళ్లు చేస్తే చాలా పెద్ద విషయం అంటున్నారు.కాని ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ తీసుకున్న నిర్మాతలు మాత్రం 15 నుండి 20 కోట్ల వరకు వసూళ్లు సాధించి మొదటి సారి తెలుగులో విజయ్‌ సత్తా చాటబోతున్నాడు అంటూ నమ్మకంగా చెబుతున్నారు.

ఈసారి రికార్డులు బ్రేక్‌ అవ్వడం ఖాయం అంటున్న నేపథ్యంలో మాస్టర్‌ కు ఉన్న పోటీ సినిమాలను చూస్తే రేపు విడుదల కాబోతున్న క్రాక్‌.సంక్రాంతికి రాబోతున్న అల్లుడు అదుర్స్‌ మరియు రెడ్‌ సినిమాలు ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంటే మాస్టర్‌ పరిస్థితి ఏంటో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube