షూటింగ్ లో గాయపడ్డ మాస్టర్ మూవీ హీరోయిన్.. నెట్టింట్లో వైరల్ ఫోటోలు!

Master Movie Heroine Injured In Shooting Photos Are Viraling On Social Media

సాధారణంగా సినిమా షూటింగులు జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్న సమయంలో కొందరు సెలబ్రిటీలకు సర్జరీలు నిర్వహించడం మరికొందరికి పెద్దఎత్తున ప్రమాదాలు జరగడంతో కొన్నిసార్లు సినిమా షూటింగ్ వాయిదా పడుతూ ఉంటుంది.

 Master Movie Heroine Injured In Shooting Photos Are Viraling On Social Media-TeluguStop.com

అయితే అదృష్టం బాగుండి కొంతమంది సెలబ్రిటీలు చిన్న చిన్న గాయాలతో బయటపడతు ఉంటారు.అలా చిన్న గాయాలతో కేరళ భామ మాళవికా మోహనన్‌ బయట పడ్డారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక సినిమా షూటింగ్ సమయంలో భాగంగా గాయపడటంతో తన చేతికి మోకాలికి గాయం అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ విషయం బయటపడింది.సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన మాస్టర్ చిత్రం ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్నారు.

 Master Movie Heroine Injured In Shooting Photos Are Viraling On Social Media-షూటింగ్ లో గాయపడ్డ మాస్టర్ మూవీ హీరోయిన్.. నెట్టింట్లో వైరల్ ఫోటోలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా మాస్టర్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Telugu Malvika Mohanan, Master-Movie

ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్నటువంటి మారన్‌ మూవీలో కథానాయికగా నటిస్తోంది. రవి ఉడయార్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ చతుర్వేది హీరోగా నటిస్తున్న ‘యుత్ర’లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

అయితే ఈమెకు పెద్ద ప్రమాదమేమీ జరగకుండా కేవలం చేతికి మోకాలికి చిన్నపాటి గాయం అయినట్లు ఈమె సోషల్ మీడియా వేదికగా తన గాయాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలను షేర్ చేసిన కొంతసేపటికి లక్షల సంఖ్యలో వ్యూస్ దక్కించుకున్నారు.ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానుల సందడి చేస్తుంటారు.

ఇలా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ప్రమాదం బారిన పడ్డారని తెలియగానే అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Telugu Malvika Mohanan, Master-Movie

విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా తెలుగులోకి డబ్ కావడంతో ఈ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ విధంగా మాస్టర్ సినిమా ద్వారా నటి మాళవికా మోహనన్‌ తెలుగు ప్రేక్షక ఆదరణ కూడా దక్కించుకున్నారు.అయితే ప్రస్తుతం ఈమె పలు కోలీ వుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.ఈమెకు ఉన్న పాపులారిటీ చూస్తుంటే త్వరలోనే తెలుగు సినిమాలలో కూడా నటిస్తోందని తెలుస్తోంది.

#Master #Malvika Mohanan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube