యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న 'మాస్టర్'.. 100 మిలియన్స్ క్రాస్ చేసిన విజయ్ సాంగ్...

లాక్‏డౌన్ తర్వాత నిరాశలో ఉన్న సినీ ప్రియులకు ఒక్కసారిగా ఫుల్ జోష్ తీసుకువచ్చింది ‘మాస్టర్’ సినిమా.లోకేష్ కనకరాజన్ దర్శకత్వం విజయ్ తలపతి నటించిన మొదటి సినిమా కావడంతో… సినిమా విడుదలకు ముందే సెన్సెషన్ క్రియేట్ చేసింది.

 Master' Making A Fuss On Youtube  Vijay Song That Crossed 100 Million, Vijay, Ma-TeluguStop.com

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది.ఇక ఇందులోని పాటలు అంతే హిట్‏గా నిలిచాయి.

మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ సాంగ్ యూట్యూబ్‏లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తుంది.ఈ పాటకు మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ సంగీతం అందించగా.ఇందులో విజయ్ వేసిన స్టెప్పులు తెగ ఫేమస్ అయ్యాయి.తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‏లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది.

ఇందులో విజయ్‏కు జోడిగా మాళివక మోహనన్ నటించింది.కరోనా పాండమిక్ తర్వాత తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది మాస్టర్.

నెల రోజుల కింద ఈ పాటను అప్ లోడ్ చేసారు.కేవలం 30 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ అందుకుంది వాతి కమింగ్ పాట.రోజుకు కనీసం 2 లక్షలకు పైగానే ఈ పాటకు వ్యూస్ వస్తున్నాయి.ఈ దూకుడు ఇలాగే కొనసాగితే చాలా త్వరగానే 200 మిలియన్స్ క్లబ్బులో చేరిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇదిలా ఉంటే.తర్వలోనే విజయ్.లోకేష్ కనకరాజన్ కాంబోలో మరో సినిమా రాబోతున్నందని.గతంలోనే లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని తేనందల్ స్టూడియోస్ నిర్మించనున్నట్లుగా సమాచారం.గతంలో తేనందల్‌ స్టూడియోస్‌ విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మెర్సల్‌’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అటు లోకేష్ కనకరాజ్.కమల్ హాసన్‏తో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు.

మేలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube