ప్రశ్న పత్రంలో వింత ప్రశ్న ఇచ్చిన మాస్టారు, జాబ్‌ పోగొట్టుకున్నాడు... ఇంతకు ఆయన ఇచ్చిన ప్రశ్న ఏంటో తెలుసా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా విదార్థులు పరీక్షల్లో తలమునకలై ఉన్నారు.ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు బిజీ బిజీగా ఉన్నారు.

 Master Lost His Job Due To A Different Question In Exam Paper-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఒక మాస్టారు చేసిన పని దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.ఆయన తయారు చేసిన ప్రశ్న పత్రంలోని ఒక ప్రశ్న యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది.

ఆ ప్రశ్న వివాదాస్పదం అవ్వడంతో ఆయన ఉద్యోగమే పోయింది.ఆయన ఏదో సరదాగా ఇవ్వాలనుకున్న ప్రశ్న కాస్త బయటకు తెలిసి రచ్చ రచ్చ అయ్యింది.

కర్ణాటకలో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం దేశ వ్యాప్త చర్చకు తెర లేపింది.ఎన్నికల వేళ అవ్వడంతో ఆ ప్రశ్న మరింత హీట్‌ పెంచింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… బెంగళూరులోని రాజ రాజేశ్వరి నగర్‌లోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో పరీక్షలు జరుగుతున్నాయి.ఆ పరీక్షల్లో 8వ తరగతి విద్యార్థుల కోసం ఈవీఎస్‌ పేపర్‌ను ఆ క్లాస్‌ టీచర్‌ తయారు చేశాడు.

ఆయన ప్రశ్నల తయారీలో తన క్రియేటివిటీని ఉపయోగించేందుకు ప్రయత్నించాడు.

అందులో భాగంగా ‘రైతులకు మిత్రులు ఎవరు’ అంటూ ప్రశ్నించాడు.ఆ ప్రశ్నకు ఆయన ఆప్షన్స్‌ కూడా ఇచ్చాడు.అందులో ఎ.కుమారస్వామి బి.వానపాములు సి.యడ్యూరప్ప.ఈ మూడు ఆప్షన్స్‌లో ఎది కరెక్ట్‌ అనే విషయాన్ని విద్యార్థులు రాయాల్సి ఉంటుంది.

రైతులకు మిత్రుల అంటే సరైన సమాధానం వానపాములు.అయితే ఇక్కడ రాజకీయ నాయకుల ప్రస్థావన తీసుకు రావడం చర్చనీయాంశం అవుతుంది.ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామి మరియు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పల పేర్లను ఆయన చేర్చడంతో పెద్ద వివాదం మొదలైంది.దాంతో జేడీఎస్‌ మరియు బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ప్రశ్న తమకు వ్యతిరేకం అంటే తమకు వ్యతిరేకం అంటూ స్కూల్‌పై దాడికి ప్రయత్నించారు.దాంతో స్కూల్‌ యాజమాన్యం ఆ మాస్టారును తొలగించాం అని, అసలు తాము ఏ పార్టీకి మద్దతు కాదని, అతడు చేసిన తప్పు స్కూల్‌ బాధ్యత వహించదు అంటూ పేర్కొంది.

ప్రస్తుతం ఆ ప్రశ్న పత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube