మాస్టర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం మాస్టర్ కోసం యావత్ సౌత్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.

 Master First Week Ap Ts Collections, Master, Vijay, Vijay Sethupathi, Lokesh Kan-TeluguStop.com

ఇక ఈ సినిమాకు తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా అదిరిపోయే క్రేజ్ ఏర్పడటంతో ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

విజయ్ స్టైలిష్ యాక్టింగ్‌కు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలనిజం తోడవడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించింది.

ఇక ఈ సినిమాకు రిలీజ్ రోజునే మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కాగా కలెక్షన్ల పరంగా కూడా మాస్టర్ చిత్రం దుమ్ములేపుతోంది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం ముగిసినా కూడా థియేటర్ల వద్ద ఇంకా సందడి కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎంతమేర హిట్ అయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి.

విజయ్, విజయ్ సేతుపతిల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌లకు జనం నీరాజనం పడుతుండటంతో ఈ సినిమా సూపర్ హిట్ దిశగా వెళ్తుంది.
మాస్టర్ చిత్రం తొలి వారం ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.12.82 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది.దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం టోటల్ రన్‌లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక మాస్టర్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 3.12 కోట్లు

సీడెడ్ – 2.49 కోట్లు

గుంటూరు – 1.20 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.19 కోట్లు

ఈస్ట్ – 1.04 కోట్లు

వెస్ట్ – 1.19 కోట్లు

కృష్ణా – 1.0 కోట్లు

నెల్లూరు – 0.59 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 12.82 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube