అమెజాన్ ప్రైమ్‌లో మాస్టర్.. కానీ!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కావాల్సి ఉంది.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Master Digital Rights Amazon Prime, Master, Amazon Prime, Vijay, Digital Rights,-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్‌లో అదిరిపోయే సెన్సేషన్ క్రియేట్ చేయాలని విజయ్ అండ్ టీమ్ భావిస్తోంది.ఇక ఈ సినిమాలో విజయ్‌కు పోటీగా విలన్ పాత్రలో విజయ్ సేతుపతి కూడా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అనే సందేహం కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.దీనికి తోడు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

అయితే ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలో రిలీజ్ చేసిన తరువాతే డిజిటల్ వరల్డ్‌లో స్ట్రీమ్ చేయాలని చిత్ర యూనిట్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.దీంతో మాస్టర్ చిత్రం రెండు చోట్లా దుమ్ములేపడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

దానికి తోడు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

కాగా ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా మాళవికా మోహనన్ నటిస్తుండటంతో ఈ సినిమాలో వారిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాకు తమిళ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి మాస్టర్ థియేటర్లలో ఎప్పుడు కనిపిస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube