తమన్నాకు షాక్ ఇచ్చిన మాస్టర్ చెఫ్ నిర్వాహకులు..?

Master Chef Managers Shock Tamanna

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దకాలం పూర్తయినప్పటికీ ఏ మాత్రం అవకాశాలు తగ్గకుండా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

 Master Chef Managers Shock Tamanna-TeluguStop.com

ఒకవైపు వెండితెరపై అద్భుతమైన సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా తమన్నా బుల్లితెరపై ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.

కొన్ని వారాల పాటు తమన్నా వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమం ప్రసారం అయినప్పటికీ ఈ కార్యక్రమ నిర్వాహకులు తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆమె స్థానంలో యాంకర్ అనసూయ ను తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే తమన్నా ఈ కార్యక్రమ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి నోటీసులు పంపింది.

 Master Chef Managers Shock Tamanna-తమన్నాకు షాక్ ఇచ్చిన మాస్టర్ చెఫ్ నిర్వాహకులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమన్నా నోటీసులను అందుకున్న కార్యనిర్వాహకులు ఏకంగా ప్రెస్ నోట్ విడుదల చేసారు.

Telugu Anasuya, Master Chef, Tamanna, Tollywood, Tv Show, Web Series-Movie

ఇందులో భాగంగా కార్యనిర్వాహకులు తమన్నా హోస్ట్ గా వ్యవహరించడానికి ముందు ఆమెతో 18 ఎపిసోడ్ లకు గాను రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డీల్ కుదుర్చుకున్నారు.ఈ క్రమంలోనే ఆమె 18 రోజులలో కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు హాజరయ్యింది.అయితే అప్పటికే తమన్నాకు కోటి యాభై ఆరు లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందించాము.

మిగిలిన రెండు రోజులు ఆమె షూటింగ్ కి రాకపోవడంతో 50 లక్షల పేమెంట్ బ్యాలెన్స్ చేశామని ఆమె షూటింగ్ కు రాకపోవడం వల్ల నిర్మాతలకు నష్టం వచ్చిందని ఈ సందర్భంగా మాస్టర్ చెఫ్ నిర్వాహకులు వెల్లడించారు.ఈ షో కంప్లీట్ చేయకుండానే తమన్నా సెకండ్ సీజన్ అడ్వాన్స్ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

#Web #Anasuya #TV Show #Tamanna #Master Chef

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube