అప్పుడు ముద్దులు పెట్టిన హీరోయిన్స్‌.. ఇప్పుడు దగ్గరకు రావడం లేదు  

Master Bharath About Heroines-abcd Movie,allu Sirish,master Bharath,ఏబీసీడీ,భరత్‌

అమ్మాయిలు చూస్తుండగానే పెద్ద వారు అవుతారు అంటారు. అయిదు పది సంవత్సరాల వయసులో చూసిన అమ్మాయిలను పదేళ్ల గ్యాప్‌ తర్వాత చూస్తే వారిని గుర్తు పట్టడం చాలా కష్టం. అయితే అబ్బాయిల విషయంలో మాత్రం అది చాలా అరుదుగా జరుగుతుంది..

అప్పుడు ముద్దులు పెట్టిన హీరోయిన్స్‌.. ఇప్పుడు దగ్గరకు రావడం లేదు-Master Bharath About Heroines

ఆ అరుదైన సంఘటన మాస్టర్‌ భరత్‌ విషయంలో జరిగింది. మొన్నటి వరకు వీడు చిన్న పిల్లాడిగా సినిమాల్లో కనిపించాడు. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు పెద్ద వాడై కనిపిస్తున్నాడు.

అప్పటి సినిమాలు చూసి ఇప్పుడు వీడిని చూస్తే గుర్తు పట్టలేక పోతున్నారు.

కొందరు హీరోయిన్స్‌ అప్పుడు భరత్‌తో నటించిన సమయంలో ముద్దులు పెట్టి, ముద్దు చేసేవారట. మీద కూర్చో బెట్టుకుని ఆటలు ఆడుకునేవారట.

కాని ఇప్పుడు ఆ హీరోయిన్స్‌ దగ్గరకు రావడం లేదంటూ కామెడీగా భరత్‌ తాజాగా కామెంట్‌ చేశాడు. ఒకప్పుడు ముద్దులు పెట్టిన హీరోయిన్స్‌ ఇంకా హీరోయిన్స్‌గానే ఉన్నారు. ఇతడు మాత్రం హీరోగా మారాడు.

ఇలాంటి సమయంలో ఆ హీరోయిన్స్‌ ఫీలింగ్స్‌ ఏంటీ అంటూ ఒక ఇంటర్వ్యూలో ఇతడిని అడిగిన సమయంలో అప్పుడు ముద్దులు పెట్టిన వారు కొందరు గుర్తు కూడా పట్టడం లేదు. వారు నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు, వారు నా వద్దకు కూడా రావడం లేదు అన్నాడు.

తాజాగా భరత్‌ ‘ఏబీసీడీ’ అనే చిత్రంలో నటించాడు. అల్లు శిరీష్‌తో ఈ చిత్రంలో భరత్‌ కలిసి నటించాడు.

అల్లు శిరీష్‌ స్థాయి పాత్రగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఈ పాత్రతో సినిమాకు చాలా బలంగా నిలుస్తాడట. అలాంటి పాత్రను చేసినందుకు గాను భరత్‌కు ఈ చిత్రంపై చాలా నమ్మకం ఉంది..

తప్పకుండా ఈ చిత్రం సక్సెస్‌ అయితే మంచి ఆఫర్లు వస్తాయని ఆశ పడుతున్నాడు. మరి ఈ చిత్రం సక్సెస్‌ అయ్యి భరత్‌కు నటుడిగా మంచి గుర్తింపు దక్కుతుందా అనేది చూడాలి.