మనుషుల కంటే ఎక్కువ జాగ్రత్తగా పిల్లలను రోడ్డు దాటించిన గొరిల్లా.. వీడియో వైరల్!

సాధారణంగా వాహనాలు వెళ్లే రోడ్డు దాటడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని.ఇరుపక్కలా ఏ వాహనం రానప్పుడే రోడ్డు దాటాలని పెద్దలు, అధికారులు చెబుతుంటారు కానీ ఈ నియమాలను పాటించే వారు తక్కువే.

 Massive Silverback Gorilla Blocks A Road So His Family Can Cross Safely Details,-TeluguStop.com

ఈ రోజుల్లో వాహనాలు వస్తుండగానే రోడ్డు క్రాస్ చేసేవారు చాలామంది.ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరపడి రోడ్డు దాటుతూ ప్రమాదాల్లో పడుతుంటారు.

ఇక జంతువులు కూడా రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతుంటాయి.ముఖ్యంగా జంతువుల పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటాయి.

అడవిలో కూడా రోడ్డు మార్గాలు వేశారు కనుక ప్రతిరోజు ఎన్నో జంతువులు ప్రమాదాలకు గురవుతున్నాయి.అయితే ఒక గొరిల్లాకి రోడ్డు దాటడం ఎంత ప్రమాదమో తెలిసినట్టుంది.

అందుకే అది తన పిల్లలను చాలా జాగ్రత్తగా రోడ్డు దాటించి వావ్ అనిపించింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్ద గొరిల్లా తన కుటుంబంతో కలిసి రోడ్డు దాటుతుండటం చూడవచ్చు.మొదటగా ఈ గొరిల్లా రోడ్డుపైకి వచ్చి ఇరువైపులా వాహనాలు వస్తున్నాయో రావట్లేదో చెక్ చేసింది.

అనంతరం తన పిల్లలను రోడ్డు దాటాలంటూ సైగ చేసింది.అప్పుడు మిగతా గొరిల్లాలు, వాటి పిల్లలు రోడ్డు దాటడం మొదలెట్టాయి.

ఈ సమయంలో పెద్ద గొరిల్లా రోడ్డుకి అడ్డంగా నిల్చొని తన పిల్లలను ప్రొటెక్ట్ చేసింది.దీనికి సంబంధించిన వీడియోని వండర్ ఆఫ్ సైన్స్ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

ఈ వీడియోకి 72 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.“రోడ్డు దాటేటప్పుడు ఈ గొరిల్లా మనుషుల కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటుంది! ఇది చూసేందుకు అద్భుతంగా ఉంది” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఈ గొరిల్లా అడ్డంగా నిల్చొని తన గొప్ప హృదయాన్ని చాటుకుందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

మనుషులే కాదు జంతువులు కూడా తమ పిల్లలను కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెడతాయాని చెప్పడానికి ఇదే నిదర్శనం అని ఇంకొందరు కామెంట్లు చేశారు.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube