రోడ్డు మధ్యలో ఇరుక్కున్న ఇల్లు.. కారణం ఏంటంటే?  

Massive road Bridge Built around the House,China, Viral Video, Social Media - Telugu China, House, Massive Roadm Bridge Built, Social Media, Viral, Viral Video

సాధారణంగా అధికారులు రోడ్డు విస్తరణ కోసం రోడ్డు పక్కన ఉన్న ఇళ్లను కూల్చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే.బాధితులు అధికారులకు ఎదురు చెప్పాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు.

TeluguStop.com - Massive Road Bridge Built Around House China Viral

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కోర్టులో పిటిషన్లు దాఖలు చేసినా అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.రోడ్ల విస్తరణ అభివృద్ధిలో భాగం కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్లు కూడా ఎవరూ ఉండరు.

TeluguStop.com - రోడ్డు మధ్యలో ఇరుక్కున్న ఇల్లు.. కారణం ఏంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఒక మహిళ మాత్రం రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిని ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. అధికారులు పరిహారం ఇస్తామని చెప్పినా తన ఇంట్లోనే తాను ఉంటానని తేల్చి చెప్పింది.

ఆ మార్గంలో వంతెన పడుతోందని సదరు మహిళ ఇల్లు అడ్డుగా ఉందని ఎంత చెప్పినా మహిళ మాత్రం వినలేదు.మహిళ మాట వినకపోవటంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకున్నారు.

***

చివరకు చేసేదేం లేక ఇల్లును విడిచిపెట్టి ప్లాన్ ను మార్చి రోడ్డు నిర్మాణం చేపట్టారు.చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దేశంలోని గౌవంగ్జూ నగరంలో హిజుయాంగ్ వంతెన దగ్గర రోడ్డు మధ్యలో ఇరుకున్నట్టు కనిపిస్తున్న ఒక ఇల్లు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.లియాంగ్ అనే మహిళ అధికారులు పరిహారం ఇస్తామని చెప్పినా వినలేదు.

ఆమె అధికారులు చెప్పిన మొత్తం కంటే 75 లక్షలు అధికంగా కావాలని కోరడంతో అధికారులు ఆమె ఇంటిని వదిలేసి వంతెన నిర్మించారు.ప్రస్తుతం రోడ్డు మధ్యలో ఇల్లు ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

#Viral Video #China #MassiveRoadm #House #Viral

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Massive Road Bridge Built Around House China Viral Related Telugu News,Photos/Pics,Images..