సికింద్రాబాద్ లో దారుణం  

Massive Road Accident In Secunderabad-massive,road Accident,secunderabad,దారుణం

సికింద్రాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలుడు తప్పిదం కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా,మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్ వారసిగూడ చౌరస్తాలో గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది..

సికింద్రాబాద్ లో దారుణం-Massive Road Accident In Secunderabad

టాటా ఏస్ వాహనం నడిపేందుకు ఒక మైనర్ బాలుడు ప్రయత్నించడం తో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే…. గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్ వారసి గూడ లో శుభకార్యం జరుగుతుంది. ఈ క్రమంలోబ్యాండ్ టీమ్ వెళుతుండగా ఆ వెనుకగా వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని డ్రైవర్ ఆన్ లోనే ఉంచి పక్కనే ఉన్న పాన్ షాప్ లోకి వెళ్ళాడు.

దీనితో ఒక బాలుడు ఆ బండిన నడపడం కోసం అని వాహనాన్ని రేజ్ చేసాడు. అయితే వాహనం గేర్ లోనే ఉండడం తో ముందు వెళుతున్న బ్యాండ్ టీమ్ పై దూసుకెళ్లింది. దీనితో ఒక వ్యక్తి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోగా,మరో ఇద్దరు బాలురు గాయపడినట్లు సమాచారం.

అయితే ఈ ఘటన తో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనితో కేసు చిలకల గూడ పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.