వైరల్ వీడియో: క్షణాల్లో పర్వతం మాయం… అవాక్కైన నెటిజన్లు!  

massive landslide smokes a whole mountain up in cloud, mountain, massive mountain collapses, social media, viral video - Telugu Landslide Smokes, Massive Landslide Smokes A Whole Mountain Up In Cloud, Massive Mountain Collapses, Mountain, Social Media, Viral Video

సాధారణంగా భూకంపాలు, సునామీలు వస్తే ఇళ్లు కూలిపోయి ఊర్లకు ఊర్లే మాయమైన ఘటనల గురించి మనం వింటూనే ఉంటాం.ఇప్పటివరకు మనం తుఫానులు లేదా భూకంపాలు వస్తే పర్వాతాలపై ఉన్న మట్టి, రాళ్లు కింద పడిపోవడం మాత్రమే చూసి ఉంటాం.

TeluguStop.com - Massive Landslide Smokes Whole Mountain Up Cloud

తాజాగా అదే విధంగా ఒక పర్వతం మాయమైంది.ఉన్నపళంగా పర్వతం కుప్పకూలిపోయింది.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.నిమిషాల వ్యవధిలో పర్వతం కూలిపోవడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

నెటిజన్లు పర్వత్వం మాయమైన దృశ్యాలను చూసి గతంలో తాము ఇలాంటి ఘటనలను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.పర్వతం ఉన్నపళంగా కూలిపోవడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది.
అయితే అంత పెద్ద పర్వతం ఎలా కూలిపోయింది.? పర్వతం కూలిపోవడానికి కారణాలేమిటి.? ఈఘటన ఎక్కడ జరిగింది.? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.నిపుణులు మాత్రం సాధారణంగా భూమిలో మార్పులు చోటు చేసుకుంటే ఇలాంటి మార్పులు జరుగుతాయని.ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చి ఉండవచ్చని.

TeluguStop.com - వైరల్ వీడియో: క్షణాల్లో పర్వతం మాయం… అవాక్కైన నెటిజన్లు-General-Telugu-Telugu Tollywood Photo Image

భూకంపం వల్లే పర్వతం కూలి ఉండవచ్చని తెలుపుతున్నారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిస్తే అక్కడి పరిస్థితులు, వాతావరణం, ఇతర పరిస్థితుల ఆధారంగా మిగిలిన విషయాలు తెలుస్తాయని పేర్కొంటున్నారు.

మరి కొందరు మాత్రం వైరల్ అవుతున్న ఈ వీడియో నిజం కాకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు.కొందరు మాత్రం ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల గజగజా వణుకుతుంటే ఇలాంటి వీడియోలు తమలో భయాందోళనను పెంచుతున్నాయని.

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయని.ఈ ఘటనలు చోటు చేసుకోవడానికి కారణాలు అంతుచిక్కటం లేదని కామెంట్లు చేస్తున్నారు.

#MassiveMountain #Social Media #Viral Video #Mountain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Massive Landslide Smokes Whole Mountain Up Cloud Related Telugu News,Photos/Pics,Images..