వావ్: సూర్యుడి చుట్టూ వింత గోళం... చూడడానికి ఎంత బాగుందో కదా...!

ప్రపంచంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక వింత రోజూ జరుగుతూనే ఉంటాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో భూగోళం మీద ఉన్న ప్రతి మనిషి తెలుసుకోగలుగుతున్నాడు.

 Massive Halo Around Sun, Sun, Halo Effect, Tamilnadu-TeluguStop.com

ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా, లేదా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వాటిని ప్రపంచంతో పంచుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అనేక దారులున్నాయి.దీంతో ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగిన ప్రతి ఒక్కరు దానిని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది.సోమవారం రోజున తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే సమయంలో తమిళనాడు తీరం లో సూర్యుని చుట్టూ ఓ పెద్ద ఉంగరం ఆకారంలో వలయం కనిపించింది.

ఇది ఏకంగా గంటసేపు ఆకాశంలో కనువిందు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది.దీనిని సైన్స్ పరంగా ” హాలో ఎఫెక్ట్ “ అని అంటారు.

అయితే ఇది ఎప్పుడో ఒకసారి జరిగే సన్నివేశం కాదని, ఒక సంవత్సర కాలంలో ఏకంగా వంద రోజులు ఇలా కనిపించే అవకాశం ఉందని సైంటిస్టులు తెలియజేస్తున్నారు.నిజంగా ఇలాంటి తెలియని ఎన్నో సంఘటనలు మన చుట్టూనే జరుగుతుంటాయి.తాజా సంఘటనతో ఆ దృశ్యం అక్కడి ప్రజలను ఎంతో వింత అనుభూతికి లోనుచేసింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube