5. సంజు వల్ల సంజయ్‌కి ఎంత ముట్టిందో తెలిస్తే నోరెళ్లబెడతారు   Massive Gains Of Sanju Movie Box Office Collection     2018-07-10   04:18:12  IST  Raghu V

బాలీవుడ్‌ సంచలనాత్మక చిత్రం ‘సంజు’ భారీ వసూళ్లను సాధిస్తుంది. కేవం వారం రోజుల్లో ఏకంగా 250 కోట్లను వసూళ్లు చేసిన సంజు చిత్రం ఇంకా భారీ వసూళ్ల దిశగా ముందుకు సాగుతుంది. రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవిత చరిత్రను చూపించడం జరిగింది. సంజయ్‌ దత్‌ జీవితంలో ఎన్నో విశాదకర విషయాలు జరిగాయి. ఆయన చాలా విభిన్నమైన జీవితాన్ని గడిపాడు. దాంతో ప్రేక్షకులు ఆ విషయాను తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ప్రేక్షకులు సినిమాను చూస్తున్నారు.

సంజయ్‌ దత్‌ తన జీవిత చరిత్రతో సినిమాను తీసేందుకు దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ నుండి ఏకంగా 10 కోట్ల మేరకు మొదట పొందినట్లుగా తెలుస్తోంది. ఏ ఒక్కరు కోరుకోని విధంగా, ఏ ఒక్కరు తన జీవితంలో చీకటి రహస్యాలు చెప్పేందుకు ఇష్టపడని విషయాలను కూడా సంజయ్‌ దత్‌ చెప్పుకొచ్చాడు. తాను అమెరికాలో బిక్షం ఎత్తుకున్న విషయం, వందల సంఖ్యలో అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్న విషయాలు ఇలా ఎన్నో విషయాలను సంజయ్‌ దత్‌ చెప్పుకొచ్చాడు. ఆ విషయాలను సినిమాటిక్‌గా దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ చూపించడంతో ప్రేక్షకులు విపరీతంగా సినిమాకు ఎగబడుతున్నారు.

సంజయ్‌ దత్‌ తన కథ రైట్స్‌ను 10 కోట్లకు అమ్ముకోవడంతో పాటు, సినిమా లాభాల్లో కొంత వాటాను కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పది కోట్లు ఆయనకు దక్కాయి. ఇక తాజాగా సినిమా సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయిన నేపథ్యంలో సంజయ్‌ దత్‌కు మరో 25 కోట్లు వాటా రూపంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆటోబయోగ్రఫీకి ఇంత భారీ స్థాయిలో రైట్స్‌ రూపంలో దక్కిన దాఖు లేవు. సంజయ్‌ దత్‌ తన కథను అమ్ముకున్నందుకు ఏకంగా 35 కోట్లను దక్కించుకున్నాడు.

సంజయ్‌ దత్‌కు ఇతర రైట్స్‌లో కూడా వాటా దక్కబోతుంది. ఆ కారణంగా మరింతగా కూడా సంజూ బాయ్‌కి ముట్టే అవకాశం ఉందని, మొత్తంగా 50 కోట్ల మేరకు సంజయ్‌ దత్‌ దక్కించుకుంటాడనే టాక్‌ వినిపిస్తుంది. సంజయ్‌ దత్‌ ఒక సినిమాకు 20 నుండి 30 కోట్ల మేరకు పారితోషికంగా అందుకుంటాడు. అయితే తాను నటించని సినిమాకు తన కథను ఇచ్చినందుకు ఏకంగా 50 కోట్లను నిర్మాత నుండి పుచ్చుకుని రికార్డును సృష్టించబోతున్నాడు. సంజయ్‌ దత్‌కు అందుతున్న మొత్తంను చూసి సినీ వర్గాల వారు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఇండియాలోనే అతి పెద్ద బయోపిక్‌గా సంజు రికార్డు సాధించింది.