శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం... నేడు సీఎం జగన్ పర్యటన రద్దు...!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు శ్రీశైలం పర్యటన రద్దు చేయవలసి వచ్చింది.ఈ విషయాన్ని తాజాగా సీఎంవో అధికారులు తెలియజేశారు.

 Massive Fire Explosion In Srisailam Power Plant,srisailam Power Plant, Cm Jagan,-TeluguStop.com

శ్రీశైలం ప్రాజెక్టు లోని తెలంగాణ కి సంబంధించి భూగర్భ జల విద్యుత్ కేంద్రం లో అగ్నిప్రమాదం ఏర్పడిన సంగతిని సీఎంవో అధికారులు జగన్ కు తెలిపారు.ఇకపోతే అక్కడ ప్రస్తుతం ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది సిబ్బందిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపడుతున్నారు అధికారులు.

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తెలంగాణలోని సింగరేణి కు చెందిన రెండు బృందాలు కూడా బయలు దేరారు.వారందరూ కూడా సింగరేణి సి.ఎం.డి శ్రీధర్ ఆదేశాల మేరకు 20 మందితో కూడిన రెండు బృందాలు రెండు బస్సులలో శ్రీశైలానికి చేరారు.

ఇక ఈ సంఘటనపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించడం, సమావేశాలు జరపడం మంచిది కాదని జగన్ ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

ఇక ఏపీ సీఎం ఈ విషయం పై ఏపీ ప్రభుత్వం యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే వారికి సహాయ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

Telugu Andhrapradesh, Cm Jagan, Cm Kcr, Officers, Srisailam, Telangana-General-T

ఇక భూగర్భ జల విద్యుత్ కేంద్రం లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.అలా షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల సర్క్యూట్ ప్యానల్ బోర్డులో మంటలు ఎగిసి పడి భారీగా పేలుడు శబ్దాలు వచ్చాయని అధికారులు తెలియజేస్తున్నారు.మంటల్లో చిక్కుకున్న 9 మంది గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చెప్పలేమని అధికారులు తెలియజేశారు.

అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపు లోకి వచ్చేందుకు మరో మూడు గంటలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.సంఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న డీఈ శ్రీనివాస్ మోహన్, సుందర్ వెంకట్రావు పాటు అమర రాజా బ్యాటరీస్ కు చెందిన ఇద్దరు ఎలక్ట్రిషన్ జాడ ఇంకా తెలియట్లేదని, వారి కోసం సహాయ సిబ్బంది గాలింపు చేపడుతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube