ఉభయ గోదావరి జిల్లాల మత్స్య శాఖలో భారీ అవినీతి..!!

ఉభయగోదావరి జిల్లాల మత్స్య శాఖలో భారీ నగదు స్కాం బయటపడింది.దాదాపు రెండు గోదావరి జిల్లాల్లో కలిపి ఏడు కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది.

 Massive Corruption In The Fisheries Department Of Both The Godavari Districts-TeluguStop.com

పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు నాలుగు కోట్ల 12 లక్షల 80వేల నిధులు స్వాహా చేసినట్లు లెక్కలు బయటపడ్డాయి.ఫిక్స్డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో కొందరు ఉద్యోగులు డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రముఖంగా ఇంత భారీ అవినీతి లో కీలక అధికారి ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందట.

 Massive Corruption In The Fisheries Department Of Both The Godavari Districts-ఉభయ గోదావరి జిల్లాల మత్స్య శాఖలో భారీ అవినీతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సదరు అధికారి కరోనా కారణంగా మృతి చెందడం జరిగింది.

శాఖపరమైన ఆడిట్ చేస్తుండగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ స్కాం పై ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఫోర్జరీ సంతకాలతో ఇంటి దొంగలు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసిన తూర్పుగోదావరి కి బదిలీ అయిన కీలక అధికారి పద్మనాభ మూర్తి కనుసన్నల్లోనే ఈ భారీ అవినీతి జరిగినట్లు మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి.గత ఏడాది జూన్ మాసంలో పద్మనాభం మూర్తి కరోనా బారినపడి మృతి చెందడం జరిగింది.

ఈ అవినీతి విషయంలో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు.

#Anra Pradesh #CorruptionIn #Eluru #Corruption

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు