పగడపు దిబ్బను ఎప్పుడైనా చూశారా?  

Massive Coral Reef Found, Scientists ,coral reef,Great Barrier Reef , Australia,North Queensland, Subastian robot - Telugu Australia, Coral Reef, Great Barrier Reef, Massive Coral Reef Found, North Queensland, Scientists, Subastian Robot

పగడపు దిబ్బలు సముద్రం అడుగు భాగాన ఏర్పడి ఎన్నో జీవరాసులకు నిలయంగా మారుతుంటాయి.కాల్షియం కార్బోనేట్ తో తయారుచేయబడిన పగడపు పాలిప్స్ నుంచి పగడపు దిబ్బలు ఏర్పడతాయి.

TeluguStop.com - Australian Scientists Found Massive Coral Reef

చాలా పగడపు దిబ్బలు స్టోనీ పగడాల నుంచి ఏర్పడతాయి.పగడపు దిబ్బలు వెచ్చని, నిస్సార, స్పష్టమైన నీటిలో ఉత్తమంగా పెరుగుతాయి.

ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ లో భారీ పగడపు దిబ్బ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
నార్త్ క్వీన్స్‌లాండ్‌ వెలుపల ఉన్న నీటిలో నూట ఇరవై సంవత్సరాలకు ముందు ఒక దానిని కనుగొన్నారు.

TeluguStop.com - పగడపు దిబ్బను ఎప్పుడైనా చూశారా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఎంపైర్ స్టేట్ భవనం కన్నా, ఈఫిల్ టవర్ కన్నా ఎంతో పొడవైన దని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఎంపైర్ స్టేట్ భవనం ఎత్తు 381 మీటర్లు ఉంటే ఇప్పుడు కొత్తగా కనుగొన్న ఈ పగడపు దిబ్బ దాదాపుగా 500 మీటర్ల ని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ష్మిత్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఫాల్కోర్ అనే పరిశోధన నౌకలో ప్రయాణం చేసి ఉత్తర గ్రేట్ బారియర్ రీఫ్ సముద్రపు అడుగు భాగాన పరిశోధనలు జరిపి ఎనిమిది రోజుల క్రితం ఈ భారీ పొడవైన పగడపు దిబ్బను కనుగొన్నారు.ఈ దిబ్బను కనుగొనడానికి సుబాస్టియన్ అనే రోబోట్ ను ఉపయోగించారు.

ఈ రీఫ్ అన్వేషణ ఫుటేజ్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ ఫుటేజ్లో 1.5 కిలోమీటర్ల వెడల్పు,500 మీటర్ల ఎత్తులో ఈ పగడపు దిబ్బ ఏర్పడినట్లు, శాస్త్రవేత్తలు తెలియజేశారు.ఈ ప్రాంతంలోని ఇంకా 7 ఇతర పొడవైన దిబ్బలు ఉన్నాయని తెలియజేశారు.

ఈ పగడపు దిబ్బలు మూడు రకాలుగా ఏర్పడి ఉంటాయి.అవి1) మడుగుల దిబ్బలు: ఈ దిబ్బలు నిస్సార జలాల్లో తీరానికి దగ్గరగా ఏర్పడి ఉంటాయి.2) బారియర్ దిబ్బలు: గ్రేట్ బారియర్ రీఫ్ వంటి పెద్దవి, నిరంతర దిబ్బలు.ఇవి ఒక సరస్సు ద్వారా ఏర్పడి భూమిని వేరు చేయబడతాయి.3) అటాల్స్: ఇవి రింగు ఆకారంలో, సముద్ర ఉపరితలంపై ఏర్పడతాయి.నీటి అడుగు భాగాన దీపాల పైన పెరుగుతుండటం వల్ల ఇది రింగు ఆకారంలో కనిపిస్తాయి.

#Australia #Scientists #Coral Reef #Subastian Robot #MassiveCoral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Australian Scientists Found Massive Coral Reef Related Telugu News,Photos/Pics,Images..