అమెరికాలో కాల్పులు...నలుగురు మృతి...!!!

అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.ఓ ఇంట్లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో నలుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు.

 Mass Shooting In Utah Killed 4 People-TeluguStop.com

అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఒక్క సారిగా చుట్టుపక్కల నివాసితులు షాక్ కి లోనయ్యారు.అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతికి ఈ ఘటన మరొక ఉదాహరణగా నిలిచింది.

వివరాలోకి వెళ్తే…

అమెరికాలోలోని ఉటాలో ప్రాంతంలో సుమారు 10 వేల మంది జనాభాతో ఉంటుంది.ఇక్కడ స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు.

వెళ్లి వెళ్ళగానే తుపాకులతో బెదిరిస్తూనే కాల్పులకి తెగబడ్డారు.అదే కుటుంభానికి చెందినవారిపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు చనిపోగా ఒకరు గాయపడ్డారు.ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకి లోనయ్యారు.

ఈ ఘటన జరిగిన తరువాత సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే దుండగులు మొత్తం 5 గురిని చంపాలని వచ్చారని నలుగురు చనిపోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube