మాస్ రాజా ఆశలు ధమాకా తీరుస్తుందా..!

మాస్ మహరాజ్ రవితేజ ఒక్క హిట్టు మూడు ఫ్లాపులు అన్నట్టుగా ఉంది పరిస్థితి.క్రాక్ తో మాస్ రాజా ఫ్యాన్స్ కి కిక్ ఎక్కించే హిట్ ఇవ్వగా అదే తరహాలో మిగతా సినిమాలు ఉంటాయని ఊహిస్తే అవి కాస్త నిరాశపరుస్తున్నాయి.

 Mass Raja Hopes On Dhamaka Movie Raviteja  , Raviteja, Tollywood, Rama Rao On Du-TeluguStop.com

ఈమధ్య వచ్చిన ఖిలాడి ఆ తర్వాత వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.ఖిలాడి రిలీజ్ కి ముందే పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.

కానీ రామారావు సినిమా మీద మాత్రం చాలా హోప్స్ ఉన్నాయి.సినిమా ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి కలిగించాయి.

ఫైనల్ రిజల్ట్ చూస్తే మాత్రం మాస్ మహరాజ్ ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు.

ఇప్పటికైనా రవితేజ కథల విషయంలో చాలా జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఇక రామారావు రిజల్ట్ గురించి మర్చిపోయి నెక్స్ట్ చేస్తున్న ధమాకా మీద ఫోకస్ పెడుతున్నారు రవితేజ.నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో తెరకెక్కుతున్న ధమాకా సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.

కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలతో డైరక్టర్ గా తన సత్తా చాటుతూ వస్తున్న త్రినాథ రావు రవితేజతో మాస్ హిట్ కి రంగం సిద్ద్ధం చేస్తున్నారు.ధమాకా పక్కా పైసా వసూల్ మూవీ అని తెలుస్తుంది.

ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో నటిస్తున్నారని టాక్.సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది.

ధమాకా టైటిల్ లోనే రవితేజ మార్క్ ఎనర్జీ కనిపిస్తుంది.అందుకే ఈ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు.

ధమాకా తర్వాత తన నెక్స్ట్ సినిమా కథ విషయంలో చాలా ఫోకస్డ్ గా ఉన్నారు రవితేజ.సినిమా కథ పూర్తిగా నచ్చితేనే సినిమా ఓకే చేయాలని ఫిక్స్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube