ఒకే రోజు ప్రపంచ రికార్డు స్థాయిలో జరిగిన పెళ్లిళ్లు.. ఎన్ని జరిగాయో తెలుసా ?

పెళ్లి అంటే వారం రోజుల ముందు నుండే హడావిడి మొదలవుతుంది.బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది.

 Mass Marriage Of 3229 Couples Recorded In Golden Book Of World Records-TeluguStop.com

పెళ్లి అనేది ఇద్దరి మనుషులను దగ్గరి చేసే పవిత్రమైన బంధం.భారత దేశ వివాహా వ్యవస్థ పటిష్టమైనది.

స్ర్తీ పురుషులకు జీవితంలో మరుపురానిది పెళ్లి.పెళ్లిళ్లు చేసే పద్దతిలో తేడా ఉన్నా కూడా పెళ్లి బంధం మాత్రం ఒక్కటే.

 Mass Marriage Of 3229 Couples Recorded In Golden Book Of World Records-ఒకే రోజు ప్రపంచ రికార్డు స్థాయిలో జరిగిన పెళ్లిళ్లు.. ఎన్ని జరిగాయో తెలుసా -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన దేశంలో ఒకేసారి ఒకేరోజు 3229 పెళ్లిళ్లు జరిగాయి.ఇంత వరకు అన్ని పెళ్లిళ్లు ఒకే రోజు జరగలేదు.ఇన్ని పెళ్ళిళ్ళు ఒకే రోజు జరిగినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.ఈ విశేషం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రము రాయపూర్ లో ఒకేరోజు 3229 పెళ్లిళ్లు జరిగాయి.దీంతో ఈ కార్యక్రమం ప్రపంచంలోనే రికార్డ్ సృష్టించింది.ఎక్కడా కూడా ఒకేరోజు ఇన్ని పెళ్లిళ్లు జరుగలేదు.అందుకే ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది.

నిన్న ఛత్తీస్ ఘడ్ లో సామూహిక పెళ్లిళ్లు జరిగాయి.రాయపూర్ లోని ఇండోర్ స్టేడియమ్ లో 233 పెళ్లిళ్లు జరిగాయి.

అంతేకాదు సరిగ్గా ఈ పెళ్లిళ్లు జరిగే సమయంలోనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో సామూహిక వివాహాలు జరగడంతో మొత్తం 3229 పెళ్లిళ్లు నిన్న జరిగినట్లు తెలుస్తుంది.అంతేకాదు ఈ పెళ్లిళ్లకు పెద్దగా ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ హాజరయ్యారు.

హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని మతాలు వారు ఒకే వేదికలో పెళ్లి చేసుకోవడం విశేషం.

ఈ సామూహిక పెళ్ళిళ్ళను ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి.

పవిత్రమైన మాఘ పూర్ణిమ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా కన్య వివాహ్ యోజన కింద కొత్త జంటలకు 15 వేల రూపాయలకు బదులుగా 25 వేల రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించడంతో నూతన జంటలు ఆనందం వ్యక్తం చేసారు.

https://twitter.com/bhupeshbaghel/status/1365613564204118018
#Chhattisgarh #GoldenBook #229 Marriages #Bhupesh Baghel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు