మాస్ రాజా బ్లాక్ బస్టర్ హిట్ రీరిలీజ్ కు రెడీ.. ఏ సినిమానంటే?

ప్రెజెంట్ మన టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రీరిలీజ్ చేయడం జరుగుతుంది.

 Mass Maharaja Ravi Teja's Mirapakay To Re-release, Mirapakay, Mirapakay Re-relea-TeluguStop.com

ఈ రీ రిలీజ్ కు వేరే లెవల్ లో రెస్పాన్స్ లభిస్తుంది.ఇప్పటికే మన టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

స్టార్ హీరోల వింటేజ్ చిత్రాలు రీ రిలీజ్ అవుతూ కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తున్నాయి.

ఇక తాజాగా మరో స్టార్ హీరో చిత్రం రీ రిలీజ్ కు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

ఆ స్టార్ హీరో ఎవరో కాదు.మాస్ మహారాజా రవితేజ.

ప్రెజెంట్ మాస్ రాజా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు హిట్స్ ను అందుకుని కెరీర్ లోనే పీక్స్ స్టేజ్ లో ఉన్నాడు.

రవితేజ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ”వాల్తేరు వీరయ్య” కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది.ఇప్పటికే 100 కోట్లకు పైగానే రాబట్టింది.ఈ సినిమాలో రవితేజ తన యాక్టింగ్ తో మరోసారి మెప్పించాడు.

ఇలా రెండు భారీ హిట్స్ అందుకోవడంతో రవితేజ ఫ్యాన్స్ సైతం ఆనందంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా రవితేజ పుట్టిన రోజు మరొక వారం రోజుల్లో రాబోతుంది.జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కానుకగా ఈయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ”మిరపకాయ్” అలాగే విక్రమార్కుడు సినిమాలు రీరిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.మిరపకాయ్ రీ రిలీజ్ అవుతున్నట్టు పోస్టర్ కూడా రావడంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా.థమన్ సంగీతం అందించాడు.

చూడాలి ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube