ప్రెజెంట్ మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.ఇతడు వరుసగా రెండు హిట్స్ ను అందుకుని కెరీర్ లోనే పీక్స్ స్టేజ్ లో ఉన్నాడు.
అయితే రవితేజ ముందుగా ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.
రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను త్రినాధరావు నక్కిన తెరకెక్కించాడు.
ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న భారీ పోటీ మధ్యనే రిలీజ్ అయ్యింది.
ఈ బరిలో చాలా సినిమాలే వచ్చిన ధమాకా మాత్రమే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.రిలీజ్ అయ్యి నెల దగ్గర అవుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర హౌస్ ఫుల్ అవుతూ మంచి కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ సినిమా ఎప్పుడో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
ఇక సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ‘ధమాకా’ సినిమా మాత్రం ఇప్పటికి కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అవుతూ రన్ అవ్వడం విశేషం.తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ధమాకా సినిమా కొన్ని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతూ కలెక్షన్స్ పెంచుకుంటుంది.దీంతో మాస్ సినిమా పడితే రవితేజకు ఇప్పటికి తిరుగు లేదు అనే చెప్పాలి.
ఇక ధమాకా సినిమా పక్కన పెడితే రవితేజ మెగాస్టార్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది.శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి మిగతా సినిమాల కంటే మంచి కలెక్షన్స్ రాబడుతుంది.