రవితేజతో డైరెక్టర్ లొల్లి క్లియర్ అయినట్టేనా?

మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.

 Mass Maharaja Ravi Teja Sarath Mandava Ramarao On Duty, Ravi Teja, Ramarao On Duty, Sharat Mandava, Rajisha Vijayan, Divyansa Kaushik,senior Hero Venu First Look-TeluguStop.com

ప్రెసెంట్ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘ చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.ఈ సినిమాను జులై 17న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.కానీ ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు మేకర్స్.ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడం వల్ల మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

 Mass Maharaja Ravi Teja Sarath Mandava Ramarao On Duty, Ravi Teja, Ramarao On Duty, Sharat Mandava, Rajisha Vijayan, Divyansa Kaushik,Senior Hero Venu First Look-రవితేజతో డైరెక్టర్ లొల్లి క్లియర్ అయినట్టేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ఎట్టకేలకు జులై 29న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

అయితే ఈ సినిమా వాయిదా పడడానికి రవితేజ కారణం అంటూ గతంలో పలు వార్తలు వచ్చాయి.ఇక మేకర్స్ కూడా ఈ సినిమ అప్డేట్ లు ఆపేసి ఈ రూమర్స్ నిజం అనేలా చేసారు.అయితే తాజాగా మళ్ళీ ఈ సినిమా నుండి మేకర్స్ వరుస అప్డేట్ లను వదులుతున్నారు.

ఇటీవలే నా పేరు సీసా అనే పాటను వదిలి మంచి మాస్ మసాలా ప్రేక్షకులకు అందించారు.ఇక నిన్న ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్ హీరో వేణు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసారు.

ఇలా ఈ సినిమా రిలీజ్ కు అన్ని సన్నాహాలు చేస్తూ ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా రవితేజ కు డైరెక్టర్ కు మధ్య క్లాషెస్ వచ్చాయి అంటూ వచ్చిన వార్తలను డైరెక్టర్ కొట్టిపారేసినట్టు తెలుస్తుంది.కేవలం స్క్రిప్ట్ లో రెండు పాటలు బ్యాలెన్స్ ఉండడం వల్లనే ఈ సినిమా వాయిదా వేశారని శరత్ మండవ సన్నిహితులతో చెప్పారట.దీంతో హీరో రవితేజ కు డైరెక్టర్ కు మధ్య ఎలాంటి వివాదం జరగలేదని అవన్నీ రూమర్స్ మాత్రమే అని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube