మాస్‌రాజా భలే మంచి రోజు

మాస్‌ మహారాజ రవితేజ మళ్లీ వరుస సినిమాలతో బరిలోకి దిగేందుకు సిద్దం అవుతున్నాడు.ఆ మధ్య ఈయన ఫ్లాప్‌, సక్సెస్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఉండేవాడు.

 Mass Maharaja Ravi Teja Planning For Next Year-TeluguStop.com

కాని వరుసగా ఫ్లాప్‌లు అవ్వడంతో ఈయన సినిమా సినిమాకు మధ్య గ్యాప్‌ ఇస్తూ వస్తున్నాడు.తాజాగా మళ్లీ ఈయన వచ్చే సంవత్సరం పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సంవత్సరం ‘కిక్‌ 2’ మరియు ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఒక్క సక్సెస్‌ను కూడా అందుకోలేక పోయాడు.నెమ్మదిగా చేసినా, స్పీడ్‌గా చేసినా అదే ఫలితం అనే ఉద్దేశ్యంతో రవితేజ మళ్లీ స్పీడ్‌ పెంచాడు.

ఇప్పటికే రవితేజ ‘దోచేయ్‌’ ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనుండగా, వేణు శ్రీరాం దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు.ఈ రెండు సినిమాలు కూడా ఇదే సంవత్సరం ప్రథమార్థంలో పూర్తి చేయనున్నాడు.

ఆ తర్వాత ఈయన ‘భలే మంచి రోజు’ ఫేం శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు.ఇటీవలే ఈయన ఒక మంచి స్క్రిప్ట్‌ను రవితేజకు వినిపించాడు అని, ఆ స్క్రిప్ట్‌ ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ మూడు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇలా వచ్చే సంవత్సరం రవితేజ స్పీడ్‌గా సినిమాలు చేయబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube