ఆ హీరో కరోనా విరాళం ఎవరికి ఇచ్చాడో చెప్పాలంటున్న డ్యాన్స్ మాస్టర్…  

Mass Maharaj Ravi Teja Tollywood Hero Rakersh Master Dance Corona Virus Fund Tollywood Jr Ntr Jr Ntr Fans Sri Reddy - Telugu Corona Virus Fund, Dance, Jr Ntr, Jr.ntr Fans, Mass Maharaj Ravi Teja, Rakersh Master, Sri Reddy, Tollywood, Tollywood Hero

టాలీవుడ్ లో సీనియర్ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ నిత్యం ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.అయితే గతంలో కూడా మీటూ ఉద్యమం పై పోరాడినటువంటి నటి శ్రీ రెడ్డి పై  తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

 Mass Maharaj Ravi Teja Tollywood Hero Rakersh Master Dance Corona Virus Fund Tollywood Jr Ntr Jr Ntr Fans Sri Reddy

అయితే తాజాగా రాకేష్ మాస్టర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇందులో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు హీరోలు, ఆర్టిస్టులు తదితరులు తమకు తోచినంత  విరాళాల రూపంలో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ కూడా 20 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించాడు.

ఆ హీరో కరోనా విరాళం ఎవరికి ఇచ్చాడో చెప్పాలంటున్న డ్యాన్స్ మాస్టర్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయంపై రాకేష్ మాస్టర్ స్పందిస్తూ రవితేజ ప్రకటించిన 20 లక్షల రూపాయల విరాళాన్ని ఎవరికి ఇచ్చారు మరియు ఏ సమయంలో ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని కోరారు.దీంతో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజపై చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కారణంగా రాకేష్ మాస్టర్ పై రవితేజ అభిమానులు మండిపడుతున్నారు.

అంతేగాక రాకేష్ మాస్టర్ కి పిచ్చి పట్టిందని అందువల్లనే నిత్యం ఎవరో ఒకరి పై ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేయడం రాకేష్ మాస్టర్ కి కొత్తేమీ కాదు.

గతంలో కూడా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు రాకేష్ మాస్టర్ ని దారుణంగా ట్రోల్స్ చేశారు.అంతేగాక ఈ విషయంపై రాకేష్ మాస్టర్ ఎన్టీఆర్ అభిమానులు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rakesh Master Sensational Comments On Ravi Teja Corona Virus Donation Fund Related Telugu News,Photos/Pics,Images..