ఫిబ్రవరి 5న మరోసారి థియేటర్స్ లో అలరించబోతున్న మాస్ మహారాజ్ రవితేజ..!

సంక్రాంతి పండుగ సందర్భంగా మాస్ మహారాజా నటించిన సినిమా “క్రాక్ ” ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు కలెక్షన్స్ తో కూడా దూసుకుపోతుంది.

 Mass Maharaj Ravi Teja Is Going To Entertain Theaters Again On February, Krack M-TeluguStop.com

ఈ సినిమాతో మాస్ మహారాజా చాలా సంవత్సరాల తర్వాత బాక్సాఫీసు వద్ద హిట్ ను సొంతం చేసుకున్నాడు.క్రాక్ సినిమా విడుదలైన 15 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలలో దాదాపు 33 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది.

కరోనా వైరస్ కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్ లలో అడుగుపెట్టిన క్రాక్ మొత్తానికి కాసుల వర్షాన్ని కురిపించడం లో ఏ మాత్రం తగ్గడం లేదు.

పండగ సీజన్ కావడంతో పాటు, పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా వింటేజ్ రవితేజ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఈ సినిమాలో రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కూడా ఇంత మంచి హిట్ కావడానికి ఒక కారణం.

ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో నడుస్తూ ఉండగానే మరోవైపు ఆహా ఓటిటి లో కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉండగా మరోవైపు క్రాక్ సినిమాను తమిళ, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు ఈ సినిమాను డబ్ చేశారు.ఇక ఈ సినిమాను తమిళ, మలయాళ ప్రేక్షకుల కోసం ఫిబ్రవరి 5న థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేసింది  చిత్ర బృందం.క్రాక్ అనేది యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఆయా భాషలలో కూడా అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా తెలియజేసే విధంగా అవకాశాలు కనబడుతున్నాయి.

మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో క్రాక్ పుట్టించిన ఈ సినిమా ఇతర భాషలలో కూడా క్రాక్ పుట్టించే కలెక్షన్స్ లభిస్తాయో లేదో వేచి ఉండాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube