ఇండస్ట్రీలో మరో సెంటిమెంట్.. మహేష్ తో నటిస్తే అలాంటి ఇమేజ్ పక్కానా..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ అందగాడు ఎవరు అంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన ఫాలోయిన్ నే వేరు.

 Mass Image Is Perfect If You Act With Mahesh Details, Mahesh Babu, Sarkaru Vaari Paata, Keerthy Suresh, Rashmika Mandanna, Super Star Amahesh Babu, Mass Image, Mahesh Babu Mass Image, Sarileru Neekevvaru, Director Parasuram, Mahesh Babu Sentiment-TeluguStop.com

సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మహేష్ బాబు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటాడు.ఈయన సినిమాలంటే వైవిధ్యంగా ఉంటాయి.ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథలను మహేష్ ఎంచు కుంటాడు.ఈయన ఒక్కసారి కమిట్ అయితే వెంటనే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాడు.

 Mass Image Is Perfect If You Act With Mahesh Details, Mahesh Babu, Sarkaru Vaari Paata, Keerthy Suresh, Rashmika Mandanna, Super Star Amahesh Babu, Mass Image, Mahesh Babu Mass Image, Sarileru Neekevvaru, Director Parasuram, Mahesh Babu Sentiment-ఇండస్ట్రీలో మరో సెంటిమెంట్.. మహేష్ తో నటిస్తే అలాంటి ఇమేజ్ పక్కానా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మధ్యలో ఆ సినిమాకు బ్రేకులు ఉండవు.అయితే సర్కారు సినిమా మాత్రం కరోనా కారణంగా ఇన్నాళ్ల సమయం తీసుకుంది.

థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.కలెక్షన్స్ కూడా అదరగొడుతూ ముందుకు వెళుతున్నాడు సూపర్ స్టార్.మహేష్ బాబు ఈ సినిమాలో మరింత అందంగా కనిపించి అమ్మాయిల మనసు దోచేశాడు.మరి ఇలాంటి స్టార్ హీరో చార్మింగ్ హీరో అయినా మహేష్ బాబుతో నటించాలని హీరోయిన్స్ అందరికి ఉంటుంది.

అయితే అందరికి ఈయన పక్కన నటించే అవకాశం రాదు.

ఈయన కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో.ఆయనతో నటించే హీరోయిన్ ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటాడు.ఈయన తో నటిస్తే చాలా నేర్చుకోవచ్చు అంటూ ముద్దుగుమ్మలు ఈయనను పొగుడుతూ ఉంటారు.

అయితే ఇప్పుడు మరో సెంటిమెంట్ స్టార్ట్ అయ్యింది.

అది ఏంటంటే.

మహేష్ బాబు తో నటిస్తే మాస్ ఇమేజ్ రావడం పక్కా అని అంటున్నారు.ఈ విషయం ఇప్పుడు సర్కారు సినిమాతో కూడా ప్రూవ్ అయ్యింది.

కీర్తి ఎంత క్లాస్ పాత్రలలో నటించిందో అందరికి తెలుసు.కానీ ఈ సినిమాలో మాత్రం అమ్మడు మాస్ పాత్రలో చితక్కొట్టింది అనే చెప్పాలి.

మహేష్ కోసం మాస్ పాత్రలో నటించడమే కాదు.మాస్ స్టెప్పులతో అలరించి పక్కా మాస్ గర్ల్ అనిపించుకుంది.ఇక ఇంతకు ముందు మహేష్ సరిలేరు నీకెవ్వరూ లో నటించిన రష్మిక కూడా అంతకు ముందు పాత్రలలో మెప్పించి ఈ సినిమాలో మాత్రం పక్కా మాస్ గా నటించింది.మైండ్ మైండ్ బ్లాంక్ అంటూ ఆడియెన్స్ మైండ్ ను కూడా బ్లాంక్ చేసేసి మాస్ గర్ల్ ఇమేజ్ తెచ్చుకుంది.

మరి నెక్స్ట్ మహేష్ చెయ్యి పడి మాస్ అనిపించుకునే హీరోయిన్ ఎవరో వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube