వాక్సిన్ వచ్చినా మాస్కులు పెట్టుకోవాల్సిందే!

కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

 Mask, Social Distancing,  Crucial, Covid 19, Covid19 Vaccine, Scientist-TeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ కు వ్యాక్సిన్ కనుకునేందుకు పరిశోధకులు రాత్రిపగుళ్ళు శ్రమిస్తున్నారు.

ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు.అయితే ఈ నేపథ్యంలోనే వాక్సిన్ వచ్చినా సరే మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.

బేలర్ మెడికల్‌ కాలేజ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్న మరియా ఎలెనా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ తెలిపారు.

వ్యాక్సిన్ కరోనాను తగ్గిస్తుంది కానీ పూర్తిగా తొలిగించలేదు అని అయన అన్నారు.

వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా కు ముందులా ఉండాలంటే అది అసాధ్యం అని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అయన తెలిపారు.మొదట వచ్చిన వ్యాక్సిన్ అద్భుతంగా పని చెయ్యకపోయినప్పటికీ మంచి ఫలితాలు ఇస్తుందని ప్రజలు అంత కూడా ఖచ్చితంగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాల్సిందేనాని బొటాజ్జి తెలిపారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా 150 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది.ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube