కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ కు వ్యాక్సిన్ కనుకునేందుకు పరిశోధకులు రాత్రిపగుళ్ళు శ్రమిస్తున్నారు.
ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు.అయితే ఈ నేపథ్యంలోనే వాక్సిన్ వచ్చినా సరే మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.
బేలర్ మెడికల్ కాలేజ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్న మరియా ఎలెనా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ తెలిపారు.
వ్యాక్సిన్ కరోనాను తగ్గిస్తుంది కానీ పూర్తిగా తొలిగించలేదు అని అయన అన్నారు.
వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా కు ముందులా ఉండాలంటే అది అసాధ్యం అని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అయన తెలిపారు.మొదట వచ్చిన వ్యాక్సిన్ అద్భుతంగా పని చెయ్యకపోయినప్పటికీ మంచి ఫలితాలు ఇస్తుందని ప్రజలు అంత కూడా ఖచ్చితంగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాల్సిందేనాని బొటాజ్జి తెలిపారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా 150 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది.ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.