కరోనా ను కూడా తినేస్తున్నారు…!,ఎక్కడంటే..?  

Jodhpur restaurants covid curry and mask naan dishes are goes viral, Jodhpur restaurant, Corona Kofta Curry, Mask naan - Telugu Corona Kofta Curry, Jodhpur Restaurant, Jodhpur Restaurants Covid Curry And Mask Naan Dishes Are Goes Viral, Mask Naan

కరోనా ను తినేయడం ఏంటి అని అనుకుంటున్నారా.నిజంగానే కరోనా మనుషులను తినేస్తుంటే, ఒక రెస్టారెంట్ వారి వినూత్న ఆలోచన తో కరోనా ను తినే ఛాన్స్ జనాలకు వచ్చింది.

 Mask Naan Corona Kofta Curry Jodhpur Restaurant

అసలు ఈ కథేంటి అని అనుకుంటున్నారా.వివరాల్లోకి వెళితే….

రాజస్థాన్ జోధ్ పూర్ లో వేదిక మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ వారు వినూత్న ఆలోచన తో కస్టమర్ల ను ఆకర్షించేందుకు మలై కోఫ్తా కర్రీ ని ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆకారంలో తయారు చేసి కస్టమర్ల కు అందిస్తున్నారు.అంతేకాకుండా పరోటా ల షేప్ కూడా మాస్క్ ల రూపంలో తయారుచేస్తూ కస్టమర్ల ను మరింత ఆకర్షించడానికి ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు.

కరోనా ను కూడా తినేస్తున్నారు…,ఎక్కడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ కూడా రెస్టారెంట్ లు హోటల్స్ కు వెళ్ళడానికి సిద్ధంగా లేరు.ఈ క్రమంలోనే హోటల్స్,రెస్టారెంట్ ల యజమానులు జనాలను ఆకర్షించేందుకు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి,కరోనా వైరస్ తో అప్రమత్తంగా ఉండాలి అని జనాలకు ఒకపక్క మెసెజ్ ఇస్తూనే తమ హోటల్ ను కూడా పాపులర్ చేసుకోవాలని చూస్తున్నారు.అందుకే ఇలా వినూత్న ఆలోచనతో ఆ రెస్టారెంట్ వారు ఇలా కరోనా కోఫ్తా కర్రీ, అలానే మాస్క్ నాన్ లు కస్టమర్ల కు అందిస్తున్నారు.

అత్యంత పరిశుభ్రత,శానిటైజేషన్ చర్యలు చేపడుతూ కస్టమర్ల కు ఆకట్టుకునేందుకు ఇలాంటి ఆలోచనలతో రెస్టారెంట్ యాజమాన్యాలు ముందుకు వెళుతున్నారు.

అయితే ఈ కరోనా కోఫ్తా,మాస్క్ పరోటాలు తినడం కోసం జనాలు కూడా తెగ ఎగబడుతున్నారట.ప్రస్తుతం ఈ కరోనా కోఫ్తా,మాస్క్ పరోటాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.ఆ రెస్టారెంట్ కు వెళ్లి ఈ కరోనా స్పెషన్ తిని వాటిని ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఆ ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

#Mask Naan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mask Naan Corona Kofta Curry Jodhpur Restaurant Related Telugu News,Photos/Pics,Images..