మసాలా టీ త్రాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు  

మనకు రకరకాల టీలు అందుబాటులో ఉన్నాయి.ఈ మధ్య కాలంలో వెరైటీ టీలను త్రాగటానికి కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు.

అల్లం టీ,దాల్చినచెక్క టీ అంటూ చాలా రకాల టీలు ఉన్నాయి.అయితే అల్లం, యాల‌కులు, న‌ల్ల మిరియాలు, సోంపు, ల‌వంగాలు, దాల్చిన చెక్క వేసి తయారుచేసే టీని మసాలా టీ అంటారు.

-

ఈ మసాలా టీని త్రాగితే ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మధుమేహం ఉన్నవారికి మసాలా టీ చాలా అద్భుతంగా సహాయాపడుతుంది.ఈ టీ త్రాగటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

అల్లం, దాల్చిన‌చెక్క ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తాయి.కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు మసాలా టీ త్రాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

మసాలా టీలో అల్లం ఉంటుంది.కాబట్టి వికారం,వాంతులు వంటి వాటిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గర్భధారణ సమయంలో వచ్చే వాంతులు,వికారం తగ్గించటానికి ఈ మసాలా టీ చాలా బాగా సహాయపడుతుంది.మసాలా టీలో ఉండే దాల్చినచెక్క యాంటీ బాక్టీరియ‌ల్ ఏజెంట్‌గా పనిచేసి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

ప్రతి రోజు మసాలా టీని త్రాగటం వలన శరీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్‌) పోయి హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్‌) పెరుగుతుంది.దాంతో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

.

తాజా వార్తలు