మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కేసులో ఒత్తిళ్లకు తలొగ్గి జడ్జి గారు తప్పుడు తీర్పు వెల్లడించారు అంటూ పాకిస్తాన్ ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నాయకురాలు, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.లాహౌర్‌లో ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె జడ్జి తలొగ్గి ఇలాంటి తప్పుడు తీర్పు వెల్లడించారు అని అన్నారు.
తన తండ్రి కేసుపై తీర్పు చెప్పే సమయంలో జడ్జీపై కొంతమంది అనేక ఒత్తిళ్లు తెచ్చారని, దాంతో జడ్జీ వాటికి తలొగ్గి తప్పుడు తీర్పునిచ్చారని దానికి సంబంధించి ఒక వీడియో ను కూడా మరియం చూపించారు.ఇస్లామాబాద్ జడ్జీ అర్షద్ మాలిక్ మాట్లాడుతున్న ఆ వీడియోలో నవాజ్ షరీఫ్ అవినీతి కేసులో తప్పుడు తీర్పునివ్వాలంటూ కొంతమంది తనపై ఒత్తిడి తీసుకొచ్చారని మాలిక్ అంటున్నారు.
వారి ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు తీర్పును వెలువరించాననీ అప్పట్నుంచీ తాను మానసికంగా కుంగిపోతున్నాననీ, ఆత్మహత్యకూ ప్రయత్నించాననీ చెబుతున్నట్టు వీడియోలో ఉంది.అయితే ఈ వీడియో పై ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వెంటనే స్పందిస్తూ అది ఫేక్ వీడియో అంటూ కొట్టిపారేసింది.

అంతేకాకుండా న్యాయవ్యవస్థపై బురదజల్లేందుకు షరీఫ్ కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారంటూ ఇమ్రాన్ సర్కార్ విమర్శించింది.అలానే ఈ వీడియో ను అలానే వదిలేయమని తప్పకుండా ఆ ఆ వీడియో కు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపించి, నిజాలు బయటపెడతామని స్పష్టం చేసింది.మరోపక్క జడ్జి మాలిక్ కూడా ఆ వీడియో పై స్పందించారు.నాపై తప్పుడు ఆరోపణలు చేసి ఇలాంటి వీడియో లను విడుదల చేయడం వంటి చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.